Leaders of TDP and Jana Sena gave a warm welcome to Pulivarthi Vinyl

పులివర్తి వినీల్ కు ఘనంగా స్వాగతం పలికిన టిడిపి,జనసేన పార్టీ నాయకులు

పాకాల (భారత్ న్యూస్ )తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో”మీ ఇంటి వద్దకు -మీ పులివర్తి నాని”బాబు షూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీ” కార్యక్రమానికి చిత్తూరు పార్లమెంటరీ అధ్యక్షుడు,చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని తనయుడు పులివర్తి వినీల్ పాకాల పంచాయతీ పొగతోట వీధి నుండి గురువారం ప్రారంభించారు.పులివర్తి వినీల్ కు టీడీపీ,జనసేన పార్టీ పాకాల మండల నాయకులు,కార్యకర్తల,మహిళలు ఘనంగా స్వాగతం పలికారు.తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో గెలవాలని,వెనుకబడిన చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని,అందుకుగాను పులివర్తి నానికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి,నియోజకవర్గ అభివృద్ధికి ప్రజలు మొదటి అడుగు వేయవలసిందిగా కోరారు.నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మిని మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ చంద్రగిరి నియోజకవర్గ దశ,దిశ మార్చగలిగిన వ్యక్తి పులివర్తి నానిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.