Convener of Rayalaseema Naveen Kumar Reddy expressed his support to the Anganwadi workers

అంగన్వాడి కార్యకర్తలకి మద్దతు తెలిపిన రాయలసీమ కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి

తిరుపతి (భారత్ న్యూస్)

తిరుపతి నగరపాలక సంస్థ వద్ద మూడవ రోజు అంగన్ వాడీ సిబ్బంది చేస్తున్న నిరవధిక సమ్మెకు రాజ్యసభ మాజీ సభ్యులు ఏపీసీసీ మీడియా చైర్మన్ N.తులసిరెడ్డి గారు, ఐ ఎన్ టి యు సి జిల్లా గౌరవ అధ్యక్షులు, రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున సంఘీభావం తెలిపి సంపూర్ణ మద్దతు ప్రకటించి ప్రసంగించారు…

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సందర్భంగా పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకొనేలా అంగన్ వాడీ వర్కర్లకు,హెల్పర్లకు,మినీ వర్కర్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని అందులో ప్రధానంగా…
1) కనీస వేతనంగా 26000 జీతంగా చెల్లించాలి!
2) బీమా సౌకర్యం కల్పించాలి
3) వేతనంతో కూడిన సెలవులు ప్రకటించాలి
4) మెనూ చార్జీలను పెంచి గర్భిణీ స్త్రీలకు పసిబిడ్డలకు పౌష్టికాహారం ఇచ్చేలా చర్యలు చేపట్టాలి!
5) అంగన్వాడీ మహిళలకు వయో పరిమితి పెంచాలి!
6) సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాడ్యుటి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు!

తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 11,000 నుంచి 18 వేల వరకు జీతాలు పెంచి అంగన్ వాడీ సిబ్బందికి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన వాగ్దానాన్ని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకున్నారన్నారు!

అంగన్ వాడీ సోదరీమణులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరసనలో భాగంగా అంగన్ వాడీ సెంటర్లకు వేసిన తాళాలను పగలగొట్టి వాలంటీర్ల ద్వారా నడిపించాలన్న ప్రభుత్వ ఆలోచన దుర్మార్గమన్నారు!

అంగన్ వాడీ మహిళలు చాలీచాలని జీతాలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ తమ కష్టాన్ని సైతం లెక్కచేయకుండా గర్భిణీ స్త్రీలకు, చంటి బిడ్డలకు పౌష్టికాహారం అందిస్తున్నారన్నారు!

ఏపీ సీఎం ఓ నియంతలా వివరిస్తున్నారని పాదయాత్ర సందర్భంగా మహిళల తల పట్టుకొని ముద్దులు పెట్టి, చేతిలో చెయ్యేసి త్వరలో మన ప్రభుత్వం వస్తుందని, మాట తప్పను మడమ తిప్పను అని చెప్పిన జగన్ మాటలు నేడు నీటి మూటలయ్యాయని ఎద్దేవా చేశారు!

అంగన్వాడీల సమస్యల సత్వర పరిష్కారానికి ఏపీ సీఎం బటన్ నొక్కకపోతే మూడు నెలల తర్వాత జరిగే ఎన్నికలలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు లక్ష మంది అంగన్ వాడీ సోదరీమణులు కుటుంబ సమేతంగా వైకాపా ప్రభుత్వాన్ని బటన్ నొక్కి బంగాళాఖాతంలో కలిపేస్తారని హెచ్చరించారు!

అంగన్వాడి మహిళలు పడుతున్న శ్రమకు తగిన జీతాలు చెల్లించకుండా వాళ్లకంట కన్నీరు పెట్టించడం రాష్ట్ర ప్రభుత్వానికి మంచిది కాదని హెచ్చరించారు!

జగన్ తీరు వినాశకాలే విపరీత బుద్ధి అన్న చందంగా మారిందని తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికలలో అహంకారపూరిత పాలనకు ఏ విధంగా చరమగీతం పాడి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఫామ్ హౌస్ కి పరిమితం చేశారో అదే తరహాలో ఏపీ లోని అన్ని వర్గాల ప్రజలు మూడు నెలలలో సాగనంపుతారన్నారు!

ఈ కార్యక్రమంలో సీనియర్ జిల్లా కాంగ్రెస్ నాయకురాలు శ్రీ ప్రమీలమ్మ గారు,కాంగ్రెస్ నాయకులు సోమశేఖర్ రెడ్డి, వెంకట నరసింహులు,దూది రమేష్,రామచంద్రారెడ్డి గోవర్ధన్ రెడ్డి,రామచంద్రయ్య, అనిల్ తదితరులు పాల్గొన్నారు!