పోలింగ్ కేంద్రాలలో మౌళిక వసతులు త్వరగా ఏర్పాట్లు చేయండి.

పోలింగ్ కేంద్రాలలో మౌళిక వసతులు త్వరగా ఏర్పాట్లు చేయండి.
*తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి అదితి సింగ్

తిరుపతి ( భారత్ న్యూస్)తిరుపతి నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు అవసరమైన అన్ని మౌళిక వసతీ ఏర్పాట్లు త్వరగా చేయాలని తిరుపతి నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ అదితి సింగ్ అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో చేయాల్సిన ఏర్పాట్లపై మంగళవారం మధ్యాహ్నం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఇంజినీరింగ్ అధికారులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు వచ్చి ఓటు వెళ్ళే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు. పోలింగ్ కేంద్రాల్లో గాలి, వెలుతురు బాగా వచ్చేలా చూడాలని అన్నారు. ఫ్యాన్లు, విద్యుత్ దీపాలు ఉండేలా చూడాలని అన్నారు. త్రాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం ఉండేలా చూడాలని అన్నారు. అలాగే అన్ని పోలింగ్ కేంద్రాల్లోకి వృద్దులు, వికలాంగులు వెళ్లేందుకు ర్యాంప్ ఏర్పాటు చేయాలని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పక్కగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, మునిసిపల్ ఇంజినీర్లు చంద్రశేఖర్, వెంకట్రామి రెడ్డి, డి.ఈ.లు విజయకుమార్ రెడ్డి, సంజయ్ కుమార్, మహేష్, తేజస్విని, రాజు, శ్రావణి, తదితరులు ఉన్నారు.