.Response to the petitions and give immediate justice to the people

ఏలూరు జిల్లా ముదినేపల్లి:::(భారత్ న్యూస్) * 2023\12\23….స్పందన అర్జీలపై స్పందించి ప్రజలకు వెంటనే న్యాయం చేయాలని గ్రామ మండల స్థాయి అధికారులు సమన్వయంతో సమస్యలు పరిష్కారం చేయాలన్న ఏలూరు జిల్లా జే. సి. లావణ్యవేణి
, : గ్రామ , మండలస్థాయి అధికారులు సమన్వయంతో అర్జీదారుల సమస్యలను పరిష్కారం చేకూరుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి అన్నారు. ముదినేపల్లి లోని వి కన్వెన్షన్ హాల్లో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జె.సి.మాట్లాడుతూ మండలంలో ఎక్కువగా పెయ్యేరు , వణుదుర్రు , వైవాక , ఊటుకూరు , ముదినేపల్లి , దేవపూడి గ్రామాల్లో పంచాయతీరాజ్ , పోలీస్ , మత్స్య , ఆర్డ.బ్ల్యూ.ఎస్ , ఉపాధిహామీపథకం , వ్యవసాయ , నీటిపారుదల , డ్రైనేజీశాఖల పనితీరుపై వచ్చిన సమస్యల్లో అర్జీలు ఎక్కువగా వచ్చాయని,పెదపాలపర్రు గ్రామంలో జగనన్న డిజిటల్ సర్వేలో రైతులకు తప్పు కొలతలతో అన్యాయం జరుగుతోందని గ్రామస్తులు ఇచ్చిన అర్జీపై వెంటనే పరిష్కార మార్గంం చూపాలని అదెసించి,సుచనలిచ్చి, మీచింగ్తుఫాన్ వల్ల రైతులు మొలకలు వచ్చి కోతల కోయలేక ధాన్యం పనికిరాక కొనుగోలు జరగటం లేదని అధికారులు స్పందించి రైథులకి న్యాయమ్ చైయాలని ఉప్పరగూడెం వాస్తవ్యులు నర్సిరెడ్డి వెంకటేశ్వరరావు ధాన్యం శాంపులతో అర్జీని సమర్పించారు,గతంలోనీ అర్జీలు పరిష్కారం కానందున వచ్చిన అర్జీలలో పునరావృత్తం అవుతున్నాయన్నారు. అర్జీదారుల సమస్యలు పరిష్కారం కానందున ఆయా శాఖల అధికారులు తిరస్కరించినట్లు సంతకం చేయడం జరుగుతుందన్నారు. ప్రజా సమస్యలు వచ్చినప్పుడు అర్జీని కూలంకుషంగా చదివి అనుకూల , ప్రతికూలపరిస్థితిని గుర్తించి పరిష్కారం దిశగా గ్రామస్థాయి అధికారులు మండల స్థాయి అధికారులతో సమీక్షించి వాటిని సంబంధిత జిల్లాస్థాయి అధికారులకు తెలపాల్చిన బాధ్యత దిగువస్థాయి అధికారులకు ఉందన్నారు. విధుల నిర్వహణలో ప్రజా సమస్యలు పరిష్కారానికి బాధ్యతతో వ్యవహరించకపోతే చర్యలు తప్పవన్నారు. ఇప్పటినుండి సూచించిన విధంగా అధికారులు పనితీరు మార్చుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. మండలం నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో అర్జీలు వచ్చాయని జే.సి. తెలిపారు. ఈ కార్యక్రమంలోఎం.పీ.పీ. రామిశెట్టి సత్యనారాయణ ప్రజా సమస్యలును ,జె.సీ. కి ఆర్డీవో ఖాజావలి కి తెలియచేసారు తాహసిల్దార్ కే శ్రీనివాస్ , ఎంపీడీవో పి మల్లేశ్వరి , రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ గంటా సంధ్య , జడ్పిటిసి ఈడే వెంకటేశ్వరమ్మ , అన్నిశాఖల జిల్లా , డివిజన్ , మండల , గ్రామ స్థాయి అధికారులు , అర్జీదారులు , సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.