Telugu Desam Party leaders paid tributes to Dr BR Ambedkar

నందికొట్కూరులో రాజ్యాంగ నిర్మాత డా బి.ఆర్ అంబేద్కర్ గారి 67 వ వర్ధంతి, ఘనంగా నివాళులర్పించిన తెలుగుదేశం పార్టీ నాయకులు

భారత్ న్యూస్ ప్రతినిధి నందికొట్కూరు:- పట్టణంలో,నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇంచార్జ్ మాండ్ర శివానందరెడ్డి మరియు గౌరు వెంకటరెడ్డిగారి ఆదేశాల మేరకు ఉమ్మడి టిడిపి మరియు జనసేన నాయకుల ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 67 వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి టిడిపి నాయకులు రాష్ట్ర ఎస్సీ సెల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి జయసూర్య, ఉమ్మడి కర్నూలు జిల్లా మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ &తెలుగుదేశం పార్టీ నాయకులు జీ.నాగముని, నాయకులు షకీల్ అహమ్మద్, ముర్తుజావలి, జమీల్, రసూల్, కళాకార్, రాజన్న, రాజు, చాంద్, వెంకటేశ్వర్లు యాదవ్, మహేశ్వరరెడ్డి, కాంతారెడ్డి, మల్లికార్జునరెడ్డి, మాబాషా,కుమార్, మోహన్, శ్రీను, శేఖర్ జనసేన నాయకులు రవికుమార్, తెలుగు యువత జిల్లా ప్రధాన కార్యదర్శి పిఎ.మద్దిలేటి, తదితర నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతి బిఆర్ అంబేద్కర్ అంటరానితనం వివక్షతను తన చిన్నతనంలో అనుభవించి, ఆ పరిస్థితి ఎవరికి రాకూడదని, అందరికీ సమాన హక్కులు, ప్రజా సమయంలో ఓటు హక్కు, రిజర్వేషన్లు ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషిచేసిన గొప్ప మహానుభావుడు అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలు గురించి వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు, పాల్గొన్నారు.