Why this state needs Jagan (YAP Needs Jagan) program in Rachapatnam village

ఏలూరు జిల్లా కైకలూరు::: {భారత్ న్యూస్} 2023\12\20…. రాచపట్నం గ్రామంలో జగనన్నే ఎందుకు ఈ రాష్ట్రానికి కావాలి (వై ఏ పీ నీడ్స్ జగన్) కార్యక్రమం గురించి ప్రజలకు పూర్తిగా అర్థమయ్యేటట్లుగా తెలియపరిచిన ఎం.పీ.పీ. అడవి వెంకట కృష్ణ మోహన్ కైకలూరు నియోజకవర్గం ఎం.ఎల్.ఏ. డి ఎన్. ఆర్. ఆదేశాలతో రాచపట్నం గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన జగనన్న నూతన శ్రీకారాన్ని చుట్టి ప్రతి ఒక్క కుటుంబానికి ఇంటి పెద్ద కొడుకుగా కుల మత రాజకీయాల కతీతంగా ప్రజాసేవ చేస్తూ, ప్రతి ఒక్క కుటుంబానికి జగనన్న మధుర ఫలాలను అందిస్తూ ముందుకు సాగుతున్న జగనన్న ఆశయ సాధనలో జగనన్న నీడలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆనందంగా ఉండాలని తండ్రికి తగ్గ తనయుడిగా రాజన్న స్థాపించిన బాటలోఅందరికి ఆదర్శవంతుడై ప్రజలకొసం ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్న జగనన్నే మన ఆంధ్రాకు కావలసిన అర్హతలు వున్నాయని, కుల,మత, రాజకీయవర్గాలకి అతీతంగా సుపరి పాలన అందిస్తున్నందుకు మళ్లీ ముఖ్య మంత్రి గా జగనన్న నే కావాలని… కరోనా కష్టకాలంలో అన్ని రాష్ట్రాలకన్నా మిన్నగా అందరికి మేలు చేసారని, గతం ప్రభుత్వం లాగా మళీ జన్మభూమి కమిటీలు వచ్చి ప్రజలను దోచుకు తినకుండా ఉండాలంటే మళ్లీ సీ.ఎం.గా జగనే కావాలని చెపుతూ గత నాలుగేళ్లలో రాష్ట్రం సాధించిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్థూ లబ్ధిదారుల సంఖ్య మరియు ప్రతి పథకానికి పంపిణీ చేయబడిన మొత్తంతో కూడిన సంక్షేమ పధకాల ప్రదర్శన బోర్డును మండల పార్టీ అధ్యక్షులు భట్రాజు శివాజీ చే ఆవిష్కరింప చేసి .అనంతరం వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జండా ను ఆవిష్కరించి ఇంటింట ప్రచార కార్యక్రమంలో పాల్గొని గృహాలను ఏం.పి.పి.అడవి వెంకట కృష్ణ మోహన్ సందర్శించారు.ఈ కార్యక్రమం లో, మండల పార్టీ అధ్యక్షులు బట్రాజు శివాజీ,వైస్ ఎం.పి.పి. మహమ్మద్ జహీర్ , మండల సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు చెరుకువాడ బలరామరాజు , మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ షేక్ రఫీ , సర్పంచ్ అల్లూరి మంగారావు , గోపవరం సర్పంచ్ ఉలిసి వసంత కుమారి ఎం.పి.టీ.సీ.సభ్యులు లక్ష్మణ్ , గ్రామ నాయకులు ఈదా మురళి కృష్ణ , పండు బాబు , వై. ఎస్ .ఆర్ .సి. పి.నాయకులు, కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శి, సచివాలయ సిబ్బంది, వాలంటీర్స్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు