ఎఫ్ ఆర్టీఐకి 3 వ జాతీయ అవార్డు*మానవ హక్కుల గురించి,

ఏలూరు జిల్లా ముదినేపల్లి (భారత్ న్యూస్) ఎఫ్ ఆర్టీఐకి 3 వ జాతీయ అవార్డు*మానవ హక్కుల గురించి, సమాచార హక్కు చట్టం గురించి,ప్రజలకు అవగాహన కల్పించటలో పేద ప్రజలకుసేవగా చేసే సోషల్ సర్వీస్ విభాగంలో బెస్ట్ అవార్డు అమరావతి, ఫిబ్రవరి 19: సమాచార హక్కు చట్టం , హ్యుమన్ రైట్స్ పై అవగాహన కల్పిస్తున్న ఫోరమ్ ఫర్ ఆర్టీఐ జాతీయ అధ్యక్షులు ప్రత్తిపాటి చంద్రమోహన్ కు 3 వ జాతీయ బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డు లభించింది. పేదల సమస్యల పరిష్కారం కోసం,ఆర్టీఐ చట్టాలను ప్రజలకు తెలియ జేస్తున్నందుకు గ్లోబెల్ లెజెండ్ 2024 సంవత్సరానికి అవార్డును చంద్రమోహన్ అందుకున్నారు. అనతి కాలంలో 3 జాతీయ అవార్డులు రివార్డులు లభించడం పట్ల ఆర్టీఐ, హ్యుమన్ రైట్స్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.చంద్రమోహన్ తొలుత విద్యార్ది దశలో ఎస్.ఎఫ్. ఐ నాయకులు గా ,జర్నలిజంలో ప్రజాశక్తి దినపత్రిక సబ్ ఎడిటర్ గా, కాలేజ్ లో లెక్చరర్ గా పని చేసి అనేక మంది కి ఆదర్శ ప్రాయులు గా నిలిచారు. 2015 లో ఆర్టీఐ, హ్యుమన్ రైట్స్ పై అవగాహన శిక్షణ కల్పిస్తున్న చంద్రమోహన్ కార్యకర్త స్థాయి నుండి జాతీయ స్థాయి అధ్యక్షులు గా ఎదిగారు. తాను ఏ రంగంలో పనిచేసినా నీతి, నిజాయితీ గా న్యాయం కోసం పని చేయడం విశేష కృషి చేస్తూ ముందుకు దూసుకుపోతున్న ఎఫ్.అర్.టీ.ఐ. వివిధ హొదాలలొ వున్న జాతీయ నాయకులు,రాష్ట్ర నాయకులు,జిల్లాల నాయకులు, ఎఫ్ ఆర్ టి ఐ కార్యకర్తలుఆనందాన్ని వ్యక్తపరుస్తూ పత్తిపాటి చంద్రమోహన్ కి శుభాకాంక్షలు తెలియపరిచారు