నందికొట్కూరు పట్టణంలో రూ.2కోట్ల 32లక్షలతో నూతన మున్సిపాలిటీ కార్యాలయం

నూతన మున్సిపల్ కార్యాలయ శంకుస్థాపన
నంద్యాల జిల్లా ప్రతినిధి.భారత్ న్యూస్.
నందికొట్కూరు పట్టణంలో రూ.2కోట్ల 32లక్షలతో నూతన మున్సిపాలిటీ కార్యాలయం నిర్మాణం చేపట్టేందుకు మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి మున్సిపల్ కమీషనర్ పి.కిషోర్ ఆధ్వర్యంలో శిలాఫలకం శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు.

  • శాప్ చైర్మన్ శ్రీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారి కృషితో నందికొట్కూరు మున్సిపాలిటీ అభివృద్ధి జరుగుతుందని…
  • సీయం జగన్ నందికొట్కూరు మున్సిపాలిటీ కి ప్రత్యేక నిధులు కేటాయించడంతో ప్రతి వార్డులో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేయగలిగామన్నారు.
  • గ్రామ పంచాయతీ ఏర్పడినప్పటి నుంచి ప్రస్తుతం ఉన్న పాత కార్యాలయం లోనే సేవలందిస్తూ విధులు నిర్వహిస్తున్నారు.
  • ప్రస్తుత జనాభా పెరుగుదల కారణంగా కార్యాలయంలో ప్రత్యేక విభాగాలు లేకా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న దాన్ని దృష్టిలో ఉంచుకొని నూతన కార్యాలయం నిర్మించుటకు ప్రతిపాదనలు పంపిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం నూతన మున్సిపల్ కార్యాలయం నిర్మాణం కోసం రూ.2.32 కోట్ల మంజూరు చేసిందని తెలిపారు.
    ఈ కార్యక్రమంలో వైస్ చైర్ పర్సన్ అర్షపోగు ప్రశాంతి, కో ఆప్షన్ సభ్యులు కేశవరెడ్డి శ్రీనివాస రెడ్డి, అబ్దుల్ గఫార్ కౌన్సిలర్ లు కాటెపోగు చిన్నరాజు, అల్లురి క్రిష్ణ, షేక్ నాయబ్, శాలి భాష, ఆర్ట్ శ్రీను, సప్లయర్ సత్యనారాయణ , వి.ఆర్ శ్రీను, రజిని కుమార్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, లాలు ప్రసాద్, పి.శాంత కుమారి, మనపాడు అశోక్, షేక్ అబ్దుల్ రవూఫ్, గుర్రాల భాస్కర్ రెడ్డి, చెరుకు సురేష్, అబ్దుల్ హమీద్, కురువ శ్రీను, బొల్లెద్దుల రామక్రిష్ణ, చాంద్ భాష, రవింద్రా రెడ్డి, ఉస్మాన్ బేగ్, జె.రాధిక వైసిపి నాయకులు ఆర్.టి.సి బాబు, నరేష్ రెడ్డి, పి.రమేష్ తదీతరులు పాల్గొన్నారు.