Courts across Andhra Pradesh paralyzed due to lawyers’ lightning strike Lawyers’ lightning strike

భారత్ న్యూస్ విజయవాడ,

లాయర్ల మెరుపు సమ్మె కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా స్తంభించిపోయిన కోర్టులులాయర్ల మెరుపు సమ్మె కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా కోర్టులో స్తంభించిపోయాయి కొత్త చట్టం భూ హక్కు చట్టాన్ని ఆంధ్ర ప్రదేశ్ ల్యాండ్ టైటిలింగ్ 2023 యాక్ట్ నం 27 ఆఫ్ 2023 ప్రభుత్వం వెంటనే రద్దు చేయకపోతే తీవ్ర ప్రణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని న్యాయవాదులు రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు ఈ సందర్భంగా జిల్లాకోర్టు కృష్ణాజిల్లా మచిలీపట్నంలో మహిళా న్యాయవాదులు పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు 1 మచిలీపట్నం బార్ అసోసియేషన్ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు తుంగల హరిబాబు మాట్లాడుతూ కొత్త భూ హక్కు చట్టం 2023 గత అక్టోబర్ 27న ఆంధ్రప్రదేశ్ లెజిస్టైచర్ చేత ఆమోదింపబడి జీవో ఎంఎస్ నెంబర్ 512 డేటెడ్ 1-11-2023 ద్వారా అక్టోబర్ 31 నుండి అమల్లోకి వచ్చిందని ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక చట్టం అని భారతదేశంలోనే పౌర హక్కులను కాలరాసే చట్టం ఇదేనని ఈ చట్టం కారణంగా రాష్ట్ర ప్రజల స్థిరాస్తులైన వ్యవసాయ భూములు పొలాలు ఇండ్లు స్థలములు ఇండ్లతో కూడిన స్థలములు తదితరములు ఎప్పుడైనా రెవిన్యూ అధికారులు ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను లాక్కోవటం గాని వేరే వారి పేరు మీద మార్చడం గాని చేయవచ్చని దీనిపై వారసత్వ యాజమాన్య హక్కు కోసం కోట్లకు వెళ్లే హక్కును ప్రజలు కోల్పోతారని దీన్ని ప్రభుత్వం వెంటనే భేషరతుగా రద్దు చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు 2 జనరల్ సెక్రెటరీ కొట్టి రఘురాం మాట్లాడుతూ అత్యున్నతమైనవి న్యాయస్థానాలని ఈ కొత్త చట్టం ద్వారా న్యాయస్థానాలపై రెవెన్యూ బ్యూరోక్రాసికి పై స్థానాన్ని కల్పించడం ప్రభుత్వానికి సిగ్గుచేటు అని ఇది కోర్టుదికారమని దీన్ని వెంటనే రద్దు చేయకపోతే తీవ్ర ప్రణామాలు ఉ�
: తీవ్ర ప్రణామాలు ఉంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు 3 బిజెపి జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు కూనపరెడ్డి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ చట్టం రాజ్యాంగ విరుద్ధమని ఈ చట్టం ద్వారా న్యాయస్థానం యొక్క గౌరవం తగ్గిపోయి రెవిన్యూ అధికారుల స్థాయి న్యాయస్థానాల కన్నా ఎక్కువ అవుతుందని ఈ చట్టం వల్ల ప్రజలందరికీ తమ ఆస్తులపై యాజమాన్య హక్కు వారసత్వ హక్కు పూర్తిగా పోయి రెవిన్యూ అధికారుల పరమవుతుందని దీని ద్వారా అధికారంలో ఉన్న రాజకీయ నాయకుడు ఎవరి ఆస్తి నైనా సునయసంగా హక్కుదారు పేర్లను మార్చేసి సొంతం చేసుకుని అవకాశాలు పూర్తిగా ఉన్నాయని అన్యాయానికి గురైన వారు యే సివిల్ కోర్టులోను వ్యాజ్యం వేయటానికి ఉండదని హైకోర్టుకు మాత్రమే వెళ్లాలని పేద మధ్య తరగతి వారు అక్కడ వరకు వెళ్లలేక వాడి వ్యక్తిగత ఆస్తులను కోల్పోతారని న్యాయ వ్యవస్థను ధిక్కరించి ఈ కొత్త చట్టాన్ని ప్రభుత్వం భేషరతుగా రద్దు చేయకపోతే పరిణామాలు తీవ్ర స్థాయిలో ఉంటాయని ప్రభుత్వాన్ని హెచ్చరించారు,,,,,,,,,ఆకుల సతీష్ విజయవాడ ప్రతినిధి