kids, make your dreams come true

పిల్లలూ, మీ కలల సాకారం చేసుకోండి

-పాకాల ప్లాటినం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మారసాని విజయబాబు

పాకాల (భరత్ న్యూస్ )

తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం
పిల్లలూ, మీరు ఒక చిన్న పని చేస్తే చాలు… మీరు ఏమి కావాలంటే అది అవుతారని పాకాల ప్లాటినం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మారసాని విజయబాబు చెప్పారు. బాలల దినోత్సవ సందర్భంగా స్థానిక ప్రాథమిక పాటశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మీరు ఉదయం అయిదు నిమిషాలు, అలాగే నిద్రపోయే ముందు అయిదు నిమిషాలు కళ్ళు మూసుకొని నేను మాంచి మార్కులు తెచ్చుకోవాలని కోరుకుంటే… మీకు ఖచ్చితంగా మంచి మార్కులు వస్తాయి అని అన్నారు. అలాగే నేను డాక్టర్ కావాలి, పోలీస్ ఆఫీసర్ కావాలని కోరుకుంటే అలాగే అవుతారు అని వివరించారు. జి ఏం టి మెంబర్ లయన్ అర్ వి ప్రసాద్ మాట్లాడుతూ పిల్లలందరూ బాగా చదువుకొని గొప్ప ఉద్యోగాలు పొందాలని సూచించారు. ఆనాడు మేం కష్టపడి చదువుకోవడం వలన మాంచి స్థితిలో ఉన్నామని వివరించారు. లయన్ కుప్పుస్వామి నాయుడు మాట్లాడుతూ బాలల హక్కులు పెద్దలు హరించకూడదని తెలిపారు. నిజానికి ఇది బాలల దినోత్సవం అయినప్పటికీ పిల్లల పెంపకంలో పెద్దలు కూడా అనేక విషయాలు తెలుసుకోవాలని చెప్పారు. లయన్ పోతుగుంట అనీల్ మాట్లాడుతూ అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు మీరు ఏం కావాలనుకుంటారో కలలుకనండి. తప్పక మీ కలలు నెరవేరుతాయని అన్నారు. ప్రధానోపాధ్యాయులు మోహన్ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. ఆయనతో పాటు పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ బాలల దినోత్సవం ప్రాధాన్యతను వివరించారు. ముఖ్యంగా పిల్లలు మంచి అలవాట్లను నేర్చుకుంటే గొప్పవారు అవ్వవచ్చునని చెప్పారు. అనంతరం ఆట పాటల్లో గెలుపొందిన విద్యార్థులకు లయన్స్ క్లబ్ ప్రతినిధులు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో పలువురు విద్యార్థుల తల్లి దండ్రులు పాల్గొన్నారు.