joint telugu state level open football Tournament

భారత న్యూస్ నందికొట్కూరు, అట్టహాసంగా ప్రారంభమైన ఉమ్మడి తెలుగు రాష్ట్రస్థాయి ఓపెన్ ఫూట్ బాల్ టర్నమెంట్*

శాప్ ఛైర్మన్ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు .బైరెడ్డి సిద్దార్థ రెడ్డి గారి ఆశీస్సులతో నందికొట్కూరు పట్టణ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ప్రారంభించారు….
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధి గా మునిసిపల్ ఛైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్ద పీట వేసిందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో త్వరలో యువత కొరకు గ్రామీణ క్రీడాకారుల కొరకు అడుదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు బైరెడ్డి సిద్దార్థ రెడ్డి శాప్ చైర్మన్ ఐన తర్వాత క్రీడలు అభివృద్ధి చెందాయని నియోజకవర్గంలో స్టేడియం నిర్మాణాలు చేపట్టామని ఇదే మైదానంలో ఘనంగా భారీ ప్రైజ్ మని తో సంక్రాంతి సంబరాలు పలు క్రీడాంశాలలో నిర్వహించామని తెలిపారు.
క్రీడాకారులకు భోజనాలు ఏర్పాటు చేసిన వై సి పి నాయకులు ఉస్మాన్ బేగ్ క్రీడాకారులకు క్రీడా దుస్తులు అందజేసిన ఓల్డ్ బి.ఎస్.ఆర్.టీమ్ నాయకులు మున్సిపల్ కౌన్సిలర్ నాయబ్ గారిని సహకారాన్ని అందించిన వై సి పి నాయకులు రజినీ కుమార్ రెడ్డి,కిరణ్ కుమార్ రెడ్డి దాతలను ప్రత్యేకంగా అభినందించారు
కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ అబ్దుల్ జబ్బార్ కౌన్సిలర్ అశోక్ జె సి ఎస్ కన్వీనర్ అబూబాకర్ వై.సి.పి యూత్ అధ్యక్షుడు లడ్డు వై.సి.పి నాయకులు ఉస్మాన్ శాప్ కో ఆర్డినేటర్ స్వామిదాస్ రవి కుమార్ ఆర్గనైజర్లు సునీల్ కుమార్,ఇమ్రాన్ బాషా ,కోచ్ ఆనంద్ పాల్గొన్నారు…..