indian railways Institute of signal engineering

భారత్ న్యూస్ హైదరాబాద్,

66వ వార్షిక దినోత్సవాన్ని జరుపుకోనున్న ఇండియన్ రైల్వేస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ అండ్ టెలికమ్యూనికేషన్స్ (ఇరిసెట్)

సికింద్రాబాద్‌లోని తార్నాకలో ఉన్న ఇండియన్ రైల్వేస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ ఇంజనీరింగ్ & టెలికమ్యూనికేషన్స్ ( ఇరిసెట్) రైల్వే సిగ్నలింగ్ & టెలికమ్యూనికేషన్ రంగాలలో శిక్షణ ఇవ్వడంలో ప్రత్యేకత కలిగిన భారతీయ రైల్వేలోని ఎనిమిది కేంద్రీకృత శిక్షణా సంస్థలలో ఇది ఒకటి. రైల్వే సిగ్నలింగ్ & టెలికమ్యూనికేషన్ ఇంజనీర్‌లను తయారుచేయడంలో ఇరిసెట్ ఇచ్చే శిక్షణ ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. ఈ ఇన్‌స్టిట్యూట్ యొక్క యూ ఎస్ పి అంటే – ఇదే ఒక గొడుగు క్రింద పని చేసే క్రమంలో అన్ని రకాల సిగ్నలింగ్ & టెలికమ్యూనికేషన్ వ్యవస్థలను కలిగి ఉంది. ఈ ఇన్‌స్టిట్యూట్ 24 నవంబర్ 2023 నాటికి 66 సంవత్సరాలను పూర్తి చేసుకుంది.

ఇన్స్టిట్యూట్ యొక్క వార్షిక దినోత్సవం 26 నవంబర్, 2023న నిర్వహించబడుతోంది.
వార్షిక దినోత్సవ కార్యక్రమంలో బాగంగా
ప్రముఖ వ్యక్తుల నుండి ప్రతిభావంతులైన ట్రైనీలకు అవార్డుల పంపిణీ మరియు టెక్నికల్ మ్యాగజైన్ విడుదల చేయబడతాయి. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారిలో ఇన్‌స్టిట్యూట్ యొక్క అధ్యాపకులు & సిబ్బంది, ట్రైనీలు, రైల్వే మంత్రిత్వ శాఖ నుండి ప్రముఖులు మరియు పరిశ్రమ & జోనల్ రైల్వేలు మరియు మీడియా ప్రతినిధులు పాల్గొననున్నారు.

ఈ ఇన్స్టిట్యూట్ యూపిఎస్సి లేదా అర్ అర్ బి ల ద్వారా ఎంపికైన వారికీ శిక్షణ ఇస్తుంది. దాదాపు ఆరు నెలల పాటు రైల్వే సిగ్నలింగ్, రైలు కార్యకలాపాలలో భద్రత మరియు ప్రయోగశాలలలో ప్రయోగాత్మకంగా పలు అంశాలపై శిక్షణనిస్తుంది.
ఇండియన్ రైల్వే వ్యవస్థలోకి ప్రవేశించిన సిగ్నల్ & టెలికమ్యూనికేషన్ సూపర్‌వైజర్లు ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి రిఫ్రెషర్ కోర్సులను అభ్యసించవలసి ఉంటుంది. ఈ రిఫ్రెషర్ కోర్సు శిక్షణ సమయంలో, రైలు యొక్క సాంకేతికత మరియు భద్రతా ప్రోటోకాల్‌ల సమీక్షలో తాజా పరిణామాల గూర్చి బోధిస్తారు . అందుబాటులో ఉన్న వివిధ సాంకేతికతలు మరియు వ్యవస్థల సంబంధించిన అంశాలపై ప్రత్యేక శిక్షణను కూడా ఇన్‌స్టిట్యూట్ నిర్వహిస్తుంది.

దాదాపు 500 మంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ఈ సంస్థ క్యాంపస్‌లో తరగతి గదులు మరియు చక్కటి హాస్టల్ వసతిని కల్గి వుంది . ఇన్‌స్టిట్యూట్ అవుట్‌డోర్ సిగ్నలింగ్, ట్రైన్ డిటెక్షన్, ఎలక్ట్రికల్ సిగ్నలింగ్, ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్స్, బ్లాక్ సిగ్నలింగ్, టెలిఫోనీ, నెట్‌వర్కింగ్ వంటి విభిన్న విభాగాలలో 13 లాబొరేటరీలను కలిగి ఉంది. 100 ఎంబి పి ఎస్ యాక్సెస్ బ్యాండ్‌విడ్త్‌తో నేషనల్ నాలెడ్జ్ నెట్‌వర్క్ ( ఎన్ కె ఎన్ ) కనెక్టివిటీ ఈ ఇన్‌స్టిట్యూట్‌లో అందుబాటులో ఉంది. పెద్ద సంఖ్యలో సాంకేతిక మరియు పరిశోధన పుస్తకాలు. ఇన్స్టిట్యూట్ టెక్నికల్ రైట్-అప్‌లు మరియు తరగతి బోధనలో వీడియోల రూపంలో పెద్ద సంఖ్యలో లెర్నింగ్ వనరులను అభివృద్ధి చేసింది . ట్రైనీలందరికీ జోనల్ రైల్వే ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లకు అందుబాటులో ఉండే ఉమ్మడి భాగస్వామ్య డిజిటల్ రిపోజిటరీలో వాటిని అప్‌లోడ్ చేసింది.
డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( డి ఎఫ్ సి సి ఐ ఎల్ ) , రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ ( ఆర్ వి ఎన్ ఎల్ ) & రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ( ఆర్ సి ఐ ఎల్ ) వంటి ప్రభుత్వ రంగ సంస్థల ఎగ్జిక్యూటివ్‌లు మరియు మెట్రో రైల్వేస్ ప్రతినిధులు కూడా ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందారు. రైల్వే సిగ్నలింగ్‌పై మలేషియా, దక్షిణ కొరియా, ఫిలిప్పీన్స్ మొదలైన దేశాల నుండి 332 మంది విదేశీ ట్రైనీలకు శిక్షణనిచ్చిన ఘనత ఈ సంస్థకు ఉంది.
సంవత్సరానికి సగటున 5170 మంది అధికారులు మరియు సూపర్‌వైజర్లు ఈ ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందుతారు. ఇరిసెట్ ను ప్రారంబించిన నాటి నుండి ఇప్పటవరకూ 1,07,671 మంది రైల్వే సిబ్బందికి ఈ ఇనిస్టిట్యూట్ శిక్షణ ఇచ్చింది. 2022 సంవత్సరంలో, కవచ్-ఇండియన్ రైల్వేస్ ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్స్‌పై పరిశోధన చేయడానికి ఇన్‌స్టిట్యూట్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ( సి ఓ ఈ
) స్థాపించబడింది.

సిహెచ్ .రాకేష్
ముఖ్య ప్రజా సంబంధాల అధికారి
దక్షిణ మధ్య రైల్వే