tanuvella is a hero fan who admires minister gangu

భారత్ న్యూస్ హైదరాబాద్,

మంత్రి గంగులపై తనువెల్లా అభిమానం చాటుకుంటున్నవీరాభిమాని

కేసీఆర్ పథకాలు, గంగుల చేసిన అభివ్రుద్దితో కూడిన ప్లెక్సీని నిలువెల్లా ధరించి ప్రచారం

కరీంనగర్ ను గొప్పగా అభివ్రుద్ది చేసిన గంగుల కమలాకర్ గెలవాలి

రాష్ట్రంలో సంక్షేమ పాలన అందిస్తున్న కేసీఆర్ మల్లీ సీఎం కావాలి

ఒక్కపైసా తీసుకోకుండా స్వచ్ఛందంగా మైక్ తో వినూత్న ప్రచారం నిర్వహిస్తున్న చేర్యాల వాసి

వినూత్నంగా అభిమానం చాటుకొని ప్రచారం చేస్తున్న మనోహర్

ఇలాంటి అభిమానులు, చేసిన అభివ్రుద్దిపనులతో గంగుల గెలుపు ఖాయమంటున్న కరీంనగర్ ఓటర్లు

ఆయన కేసీఆర్ అపరభక్తుడు, మంత్రి గంగుల కమలాకర్ కు వీరాభిమాని, తన అభిమానాన్ని చాటుకోవడానికి తన తనువునే ప్రచారరథంగా మార్చి పర్యటిస్తున్నాడు, ఆయనే సిద్దిపేట జిల్లా చేర్యాలకు చెందిన మనోహర్, తెలంగాణలో పేదింట దేవుడులా వారి అవసరాల్ని అడక్కుండానే తీర్చడానికి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితుడై బీఆర్ఎస్ స్వచ్ఛంద కార్యకర్తగా రంగంలోకి దిగారు, కరీంనగరాన్ని, నియోజకవర్గాన్ని మంత్రి గంగుల అభివ్రుద్ది చేస్తున్న తీరుతో నగరంలో విస్రుతంగా తిరుగుతూ బీఆర్ఎస్ చేసిన మంచిని, గంగుల చేసిన అభివ్రుద్దినీ తనదైన శైలిలో వివరిస్తున్నాడు,
కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్, ఇంటింటికి నీళ్లు, రైతుబందు, ఆరోగ్య శ్రీ, కేసీఆర్ కిట్ వంటి కేసీఆర్ సర్కార్ చేపట్టిన ప్రతీ సంక్షేమ కార్యక్రమం పేదలకు ఎలా ఉపయోగపడుతుందో మనోహర్ వివరిస్తుంటే ప్రజలు ఆసక్తిగా వింటున్నారు.
కరీంనగర్ కోసం కాళ్లు విరగొట్టుకున్నాడని, పట్టిన పట్టు విడవడని నగరం కోసం తన సర్వస్వం దారపోస్తాడని అడగకుండానే వరాలు ఇచ్చే దేవుడని గంగులని కొనియాడిన మనోహర్, పుట్టిన బిడ్డ నుండి పండు ముసలి వరకూ సైతం గంగుల చేసిన మంచిని గుర్తిస్తారన్నారు, తన బందువులంతా కరీంనగర్లో ఉన్నారని, వారంతా గంగుల చేస్తున్న అభివ్రుద్ది గురించి చెప్పారని, తను సైతం ప్రత్యక్షంగా చూసానని, కరీంనగర్ బీముడని, మంచిని పంచే గంగుల గెలవాలని తను విఘ్నేశ్వరున్ని ప్రార్థిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నట్టు తెలియజేసాడు మనోహర్.

తన స్వంత ఖర్చులతో కరీంనగర్ నియోజకవర్గం మొత్తం తిరుగుతున్నానని, తన కుటంభ సభ్యులు సైతం గంగుల గెలుపులో పాలుపంచుకొమ్మని ఆశీర్వదించి పంపారని చెబుతున్న మనోహార్ లాంటి అభిమానిని సంపాదించుకున్న గంగుల కమలాకర్ గెలుపు ఎప్పుడో ఖాయమైందని, మెజార్టీ లెక్కలే ఈనెల మూడో తారీఖున తేలేదని నగర వాసులు సైతం అనుకుంటుండడం విశేషం.