minister harish rao participated in a road show

భారత్ న్యూస్ హైదరాబాద్,

నారాయణ ఖేడ్‌లో బీఆర్ఎస్ అభ్యర్ధి భూపాల్ రెడ్డితో కలిసి రోడ్ షోలో పాల్గొన్న మంత్రి హరీశ్ రావు

మంత్రి హరీశ్ రావు కామెంట్స్

నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో భూపాల్ రెడ్డి గారు హ్యాట్రిక్ విజయం సాధించబోతున్నారు.

ర్యాలీకి స్వచ్ఛందంగా వచ్చిన జనాలను చూసి కాంగ్రెస్ గుండెలు జారిపోయి ఉంటాయి

30వ తేదీ పోలింగ్ ఎలా ఉంటుందో ఇప్పటికే అర్ధం అయిపోతుంది. కనీసం 50 వేల ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ గెలుపు ఖాయమైపోయింది

కర్ణాటకలో కాంగ్రెస్ ఐదు గ్యారంటీలను నమ్మిన రైతుల గోసి ఊసిపోయింది

ఖర్గే వచ్చి తెలంగాణ రాష్ట్రం మేం పెట్టిన భిక్ష అన్నడు. మరి దేశానికి స్వాతంత్ర్యం కూడా బ్రిటీష్ వాళ్లు పెట్టిన భిక్షనా?

సొంత రాష్ట్రంలో నీళ్లు, రోడ్లు లేని ఖర్గే ఇక్కడికి వచ్చి నీతులు చెప్తున్నడు

కాంగ్రెస్ కి ఓటేసి గెలిపించిన తర్వాత రాహుల్ గాంధీ జాడ లేడు ప్రియాంకా గాంధీ పత్తా లేదు

రైతు బంధు మొదట 8 వేలు ఇచ్చి తర్వాత 10 వేలు చేసి ఇప్పుడు 16 వేలు చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చిండు.

కాంగ్రెస్ వస్తే రైతు బంధు పోతది, కరెంట్ పోతది

హస్తానికి ఓటేసి కర్ణాటక వాళ్లలాగా ఆగం అయిదామా?

కేసీఆర్ గెలిస్తే 2 వేల పింఛను 5 వేలు అయితది. సన్న సోనామసూరి బియ్యం వస్తది

రిస్క్ వద్దనుకుంటే కారుకే ఓటు గుద్దాలి.

ప్రజలు ఇదే ఉత్సాహాన్ని 30వ తేదీ వరకు దాచుకొని పోలింగ్ బూత్ లో చూపించాలి.

నారాయణ ఖేడ్ రెవెన్యూ డివిజన్, పలు కొత్త మండలాల ఏర్పాటు, తండాలు గ్రామ పంచాయితీలు, డయాలసిస్ సెంటర్, వంద పడకల ఆసుపత్రి కేసీఆర్ హయాంలో వచ్చాయి.

110 కోట్లతో తండాలకు రోడ్లు వేశాం. ఇంటింటికీ తాగునీరు వస్తుంది

నారాయణ ఖేడ్ మున్సిపాలిటీకి 50 కోట్లు కేటాయించి అభివృద్ధి చేశాం

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇచ్చిన భూములను పట్టా భూములుగా మారుస్తాం

కేసీఆర్ చెప్పింది చేశాడు. చెప్పనిది కూడా చేశాడు.