Patronize Jagananna who is doing good deeds – MLA Bhumana Karunakara Reddy

మంచి పనులు చేస్తున్న జగనన్నని ఆదరించండి – ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి

తిరుపతి( భారత్ న్యూస్ )ప్రజలకి అవసరమైన మంచి పనులు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఆదరించాలని తిరుపతి ఎమ్మెల్యే, టీటీడీ చైర్మెన్ భూమన కరుణాకర రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు మళ్లీ జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమంలో భాగంగా తిరుపతిలోని 24, 48 వ డివిజన్లలో మంగళవారం జరిగిన సభల్లో స్థానికులను ఉద్దేశించి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో జగనన్నకే ఓట్లు వేసి మళ్లీ జగనన్నే ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు. ప్రజలకు అనేక మంచి పనులు చేసిన కారణంగా మనకు మళ్లీ జగనన్నే కావాలన్నారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనే జగనన్న 1,700 కోట్ల రూపాయల సహాయం అందించారు. రాష్ట్రంలో పేద ప్రజల అందరికీ జగనన్న మూడు లక్షలా 35 వేల కోట్ల రూపాయలు సహాయం చేశారన్నారు. జగనన్న అమ్మవొడి, చేయూత, ఆసరా, గోరుముద్ద, ఆరోగ్యశ్రీ , కాపు నేస్తం, డ్వాక్రా మహిళలకు చేసిన సహాయం ఇలా చెప్పుకుపోతే ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో సంక్షేమ పథకాలను పేదవాళ్లకు అందిస్తున్నారని భూమన వివరించారు. ప్రజలకు మేలు చేసి ప్రజల గుండెల్లో సుస్థితర స్థానాన్ని ఏర్పరుచుకున్న కారణంగా మనకు మళ్లీ జగనన్నే కావలన్నారు. తిరుపతిలో అభివృద్ధి సాధిస్తోందంటే అది జగనన్న చలువేనని, ఎటు చూసినా మాస్టర్ ప్లాన్ రోడ్లు, ఫ్రీ లెఫ్ట్ లతో తిరుపతి అందంగా తయారైందని ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమాల్లో పార్టీ సినీయర్ నాయకులు దొడ్డారెడ్డి సిద్దారెడ్డి, అటవీశాఖ అభివృద్ధి డైరెక్టర్ నైనార్ శ్రీనివాసులు, వైసిపి లీగల్ సెల్ నాయకులు, తిరుపతి నగరపాలక సంస్థ స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాది ఐ.సి.ఎస్.రెడ్డి, కార్పొరేటర్ అన్నా సంధ్యా యాదవ్, పార్టీ నాయకులు తలారీ రాజేంధ్ర, బాలిశెట్టి కిశోర్, పడమటి కుమార్, దేవానంద్, టౌన్ బ్యాంక్ వైస్ చైర్మెన్ వాసు యాదవ్, జీవకోన సురేంధ్రనాధ్ రెడ్డి, రఫీ హింధూస్థాని, సునీల్ యాదవ్ పాల్గొన్నారు