social science department teachers’ forum in relation to Mandals

సాంఘిక శాస్త్ర పోరం ఏర్పాటు భారత్ న్యూస్, ఎచ్చెర్ల, నవంబర్ 30 శ్రీకాకుళం జిల్లా లావేరు, ఎచ్చెర్ల మండలాలకు సంబంధించి సాంఘిక శాస్త్ర విభాగం ఉపాధ్యాయులు ఫోరం గురువారం ఏర్పాటు చేశారు .ఈ ఫోరం గౌరవ అధ్యక్షులుగా పి .రమేష్ (అల్లినగరం) అధ్యక్షులుగా వై .రమణ మూర్తి (మెట్టవలస), కార్యదర్శిగా బి. గోవిందరాజులు (ఎచ్చెర్ల), అసోసియేట్ అధ్యక్షులుగా టి .సుశీల (అల్లినగరం), మహిళా ప్రతినిధిగా బి .సరస్వతి (లావేరు) ,కార్యవర్గ సభ్యులుగా ఎం శ్రీనివాసరావు (లావేరు), పారుపల్లి శ్రీనివాసరావు (కేశవరావుపేట ),టి. కృష్ణవేణి (కేశవరాయునిపాలెం), వి. పద్మావతి( బెజ్జపురం) తోపాటు సమన్వయకర్తగా రామ్మోహన్ రావు (కుప్పిలి) ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఎచ్చెర్ల పోలీస్ క్వార్టర్స్ ప్రభుత్వ పాఠశాల పరిధిలోని పాఠశాల సముదాయంలో ఈ ఎన్నిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి.శ్రీరాములు అధ్యక్షతన జరిగింది.