Constitution values should be practiced

రాజ్యాంగం విలువలను ఆచరించాలి – కమిషనర్ హరిత ఐఏఎస్

తిరుపతి నగరం( భారత్ న్యూస్ )

*భారతీయులందరూ రాజ్యాంగం విలువలను ఆచరించాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ కోరారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో కమిషనర్ హరిత ఐఏఎస్ మాట్లాడుతూ ఈరోజు భారత రాజ్యాంగం ఆమోదించబడిన దినంగా మనం పాటిస్తున్నామని, నేడు మనమందరం స్వేచ్చగా జీవనం సాగిస్తున్నామంటే అది మన భారత రాజ్యాంగం ఆమోదించడం వలనేనన్నారు. డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ నేతృత్వంలో రూపొందించబడిన భారత రాజ్యాంగం వలన అందరికి సమానత్వం వుండాలనే లక్ష్యం నెరవేరుతున్నదని, బడుగు, బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి రాజ్యాంగం ఎంతో ఉపయోగకరంగా మారిందని కమిషనర్ హరిత ఐఏఎస్ తెలిపారు. కార్యక్రమంలో మొదటగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలతో నివాళులు అర్పించారు. అనంతరం భారత రాజ్యాంగంలోని విషయాలపై భారత రాజ్యాంగం అమలుకు చిత్తశుద్దితో కృషి చేస్తామని అధికారులు, సిబ్బంది ముఖ్య కంఠంతో ప్రతిజ్ఞ చేసారు. ఈ కార్యక్రమంలో ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, మునిసిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, రెవెన్యూ అధికారి కె.ఎల్.వర్మ, వెటర్నరీ ఆఫిసర్ డాక్టర్ నాగేంద్ర రెడ్డి, మేనేజర్ చిట్టిబాబు, డిఈలు, సూపర్డెంట్లు, ఆర్.ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.