children’s day program was organized

భారత్ న్యూస్ విజయవాడ,

ఎచ్చెర్ల ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవం
ఎచ్చెర్ల, నవంబర్ 14 ఆంధ్ర పత్రిక మండలంలో ఎచ్చెర్ల పోలీస్ క్వార్టర్స్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బాలల దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు బేగం నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు . తొలుత సాంఘిక శాస్త్ర విభాగ ఉపాధ్యాయులు పారుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, డ్రాయింగ్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు .