Center responded positively to MP Gurumurthy’s letter

ఎంపీ గురుమూర్తి లేఖకు కేంద్రం సానుకూల స్పందన

తిరుపతి( భారత్ న్యూస్) తిరుపతి, విజయవాడలలో ఎంఎస్ఎంఇ డెవలప్‌మెంట్ అండ్ ఫెసిలిటేషన్ కార్యాలయం ఏర్పాటు చేయమని గతంలో వినతి పారిశ్రామికంగా తిరుపతి జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో పారిశ్రామికంగా అభివృద్ధి చెందితేనే అభివృద్ధి సాధ్యమనే తలంపుతో పారిశ్రామిక రంగానికి మరింత ఊతమిచ్చేలా తిరుపతి జిల్లాలో ఎంఎస్ఎంఇ డెవలప్‌మెంట్ అండ్ ఫెసిలిటేషన్ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేయమని కోరుతూ కేంద్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖా మంత్రికి తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి లేఖ రాశారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రిత్వ శాఖ హైదరాబాద్ లోని ఎంఎస్ఎంఇ డెవలప్మెంట్ మరియు ఫెసిలిటేషన్ కార్యాలయ అడిషనల్ కమిషనర్ ని తగు చర్యలు తీసుకోవలసినదిగా ఆదేశించడం జరిగింది. ఆ మేరకు సాద్యాసాధ్యాలపై విచారణ జరిపేందుకు పరిశ్రమల కమిషనరేట్ నుండి జాయింట్ డైరెక్టర్ స్థాయి సీనియర్ అధికారిని నియమించాల్సిందిగా పరిశ్రమల శాఖ కమిషనర్ మంగళగిరి వారిని ఈ-మెయిల్ ద్వారా ఆదేశిస్తూ నిర్ణీత కాలం లోపల నివేదిక సమర్పించమని కోరడం జరిగింది. తదనంతరం జిల్లా కలెక్టర్లు లేదా ఏపీఐఐసితో సమన్వయం చేసుకోవడం ద్వారా కార్యాలయం స్థాపించడానికి అవసరమైన భూమిని కూడా త్వరగా గుర్తించాలని కోరారు. ఈ నేపథ్యంలో వీరి ఆదేశాల మేరకు ఈ నెల 21వ తారీఖున విజయవాడలో 22 ,23వ తారీఖులలో తిరుపతిలో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు కమిటీ పర్యటించనున్నదని అధికారిక సమాచారం.

ఈ సందర్భంగా తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ ఈ కార్యాలయం ఏర్పాటు చేయడం వలన పారిశ్రామికంగా తిరుపతి జిల్లా పారిశ్రామికంగా మరింత పురోగతిని సాదిస్తుందని తద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని పారిశ్రామికంగా అభివృద్ధి చెందినప్పుడే పురోగతి సాధ్యమని తెలియజేసారు.