birthday celebrations of Chandragiri mla

పాకాలలో 52 కేజీల భారీ కేక్ తో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జన్మదిన వేడుకలు

భారీ కేక్ ను కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి……

పాకాల (భారత్ న్యూస్ )
తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల,చంద్రగిరి,తిరుపతి రూరల్,రామచంద్రపురం,చిన్నగొట్టిగల్లు,యర్రావారిపాళ్యం మండలాలలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 52వ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని ఆనందంతో భారీగా కేకులు కట్ చేసి వారి అభిమానాన్ని జన్మదిన నాయకునికి గురువారం శుభాకాంక్షలు తెలియజేశారు.పాకాల మండల వైఎస్ఆర్ సీపీ నాయకులు,కార్యకర్తలు టపాకాయలు పేల్చి,చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి పూలమాలవేసి స్వాగతం పలికారు.

పాకాల మండలం మండలంలోని బందార్లపల్లిలో వినాయక స్వామి,అమ్మవారి విగ్రహాలకు పూజలు చేసి తన తండ్రి ఆనవాయితీని తుడా చైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కొనసాగించారు.అనంతరం పాకాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్,వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాలకు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి 52 కేజీల వయసుతో కూడిన కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి ఘనంగా వేడుకలు,సంబరాలు జరుపుకున్నారు.అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు