Appropriate measures are being taken in the typhoon-affected areas – TTD Chairman, MLA Bhumana

తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకుంట్టున్నాము – టీటీడీ చైర్మెన్, ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి

తిరుపతి నగరం( భారత్ న్యూస్ ) తిరుపతి నగరంలో వర్షం వలన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా గత అనుభవాల దృష్ట్యా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టడం జరిగిందని టీటీడీ చైర్మెన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి అన్నారు. తిరుపతి నగరంలో మంగళవారం ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్, అర్భన్ ఎమ్మార్వో వెంకటరమణ, ఇతర అధికారులతో కలిసి వరధ ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందుస్తుగా వరద కాలువల్లో పూడిక తీయడం, కాలువలను ఆధునికరించడం, కొత్త కాలువలు నిర్మించడం వంటి చర్యలు చేపట్టం జరిగిందని, దీని వల్ల మరీ లోతట్టు ప్రాంతాల్లో మినహా వరద నీటి ఉదృతి చాలా వరకు అరికట్టడం జరిగిందన్నారు. వర్షం వలన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించడం జరిగిందన్నారు. అదేవిధంగా తుఫాన్ ప్రభావిత ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి, వారికి ఆహార పానియాలను అందజేస్తున్నట్లు వివరించారు. పూలవానిగుంట, గొల్లవానిగుంట ప్రాంతాల్లోని వారిని పరామర్శిస్తూ ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా, ఏ అవసరమొచ్చిన తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలకు భూమన తెలిపారు. పునరావాస కేంద్రాలకు తరలించిన వారితో పాటు, పునరావాస కేంద్రాలకు రాలేని పరిస్థితి ఉన్నా సరే అలాంటి వారికి ఆహార పానియాలను అందజేయాలని, వరద నీరు ఎక్కడా నిల్వ వుండకుండా చూడాలని కమిషనర్ హరిత, తహశీల్దార్ వెంకటరమణకు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉమాఅజయ్, ఎస్.ఈ మోహన్, ఎంఈలు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, డిఈలు విజయకుమార్ రెడ్డి, సంజీవ్ కుమార్, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, శానిటరీ సూపర్ వైజర్ చెంచెయ్య, ఆర్.ఐ. రామచంధ్ర, నాయకులు అజయ్ కుమార్, దూది శివ, తలారి రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు.