State Election Roll Observer Pola Bhaskar has filed a complaint against stolen votes

భారత్ న్యూస్ విజయవాడ,

స్టేట్ ఎలక్షన్ రోల్ అబ్జర్వర్ పోలా భాస్కర్ గారికి దొంగ ఓట్ల పై ఫిర్యాదు వినతిపత్రం

ఈ రోజు 20..12.23,బుధవారం, స్టేట్ ఎలక్షన్ రోల్ అబ్జర్వర్ పోలా భాస్కర్ గారికి ఫిర్యాదు వినతిపత్రం అందజేయ్యటం జరిగింది.

కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి ఒక ఓటు ఉండాలి కానీ అందుకు విరుద్ధంగా రెండు, మూడు, చోట్ల ఓట్లు ఏర్పాటు చేసుకొని ఎన్నికల సంఘం నిబంధనలకు తుట్లు పొడుస్తూ దేశ ప్రజాస్వామ్యం వ్యవస్థ అపహాస్యం చేస్తున్నారని స్టేట్ ఎలక్షన్ రోల్ అబ్జర్వర్ పోలా భాస్కర్ గారికి, తెలియజేయ్యటం జరిగింది, జిల్లా కు సంబందించిన ఎనిమిది నియోజకవర్గలలో కొన్ని వేల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు చోట్ల ఓట్లు కలిగిన వారి ఓట్లకు సంబందించిన వాటి వివరాలు వైసీపీ రాష్ట్ర పార్టీ కార్యాలయం నుండి పంపిన దొంగ ఓట్ల నివేదిక, ఫిర్యాదు వినతిపత్రం ను ఈ రోజు దామరాజు క్రాంతికుమార్. వైసీపీ రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి,చేతుల మీదుగా ఇవ్వటం జరిగింది, దాదాపు గా తెలంగాణ లో ఆంధ్రప్రదేశ్ లో ఓట్లు కలిగిన వారు 420000 పైగా ఉన్నాయని, అలాగే జిల్లా లో కొన్ని వేల ఓట్లు కలిగి ఉన్న వారి వివరాలకు సంబందించిన పిన్ డ్రెవ్ ఇవ్వటం జరిగింది. అలానే తెలంగాణ ఎన్నికల అయిపోయిన తరువాత ఈ నెల 1 తేది నుండి తెలంగాణ ప్రాంతం నుండి ఆన్ లైన్ లో ఫారం 6, ద్వారా ఫారం 8 ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మరియు జిల్లాలో దొంగ ఓట్లు చేర్చుకుంటున్నారని వాటిని పరిశీలించి ఆన్ లైన్ లో దరఖాస్తులు పెట్టిన వారిమీద చర్యలు తీసుకోవాలని కోరటం జరిగింది,

దామరాజు క్రాంతికుమార్
వైసీపీ రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి, ఒంగోలు, ప్రకాశం జిల్లా.