56th national library waro tsavalu students should

భారత్ న్యూస్ విజయవాడ,

56 వ జాతీయ గ్రంధాలయ వారో త్సవాలు విద్యార్ధులు ప్రజలు జయప్రదం చేయాలని.పిలునిచ్చిన గన్నవరం జెడ్పీటీసీ సభ్యురాలు అన్నవరపు ఎలిజా బెత్ రాణి.

జాతీయ గ్రంధాలయ వారోత్సవాలు జరపాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 14 వ తేదీ నుండి 20 తేదీ వరకు స్థానిక గ్రంధాలయం లో విద్యార్ధులు, ప్రజలుతో భాగా జరిపించాలని కార్యక్రమం వాల్ పోస్టర్ నీ విడుదల చేస్తూ,గ్రంధాలయ సిబ్బందిని సభ్యులకు ప్రజలకు పిలుపు నిచ్చిన గన్నవరం జెడ్పీటీసీ సభ్యురాలు అన్నవరపు ఎలిజా బెత్ రాణి.ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రంధాలయాలు ఆధునిక దేవాలయాలు అని ఇవి ప్రతి గ్రామంలో ఉండవలసినవి అని స్వాతంత్య్రానికి పూర్వమే మన రాష్ట్రం లో గ్రంధాలయోద్యం పెద్ద ఎత్తున జరిగిందని అన్నారు.ప్రజలను విజ్ఞాన వంతులు చేయటమే దాని లక్ష్యంగా పెట్టుకున్నారు అని అన్నారు.అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం ప్రభుత్వ ప్రతినిధులే దీనికి అర్హులని భావించి అన్ని వర్గాల ప్రజలకు అవకాశం లేకుండా చేశారని దానివలన ప్రజలు ఉపయోగించుకో లేకపోయారు అని అన్నారు.దానిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరూ ఉపయోగించుకునే విధంగా కార్యక్రమం చేపట్టారని ఇది విద్యార్ధులు,ప్రజలు ఉపయోగించుకోవాలని అన్నారు.గన్నవరం మండలం లో కేవలం మూడు గ్రామాలలో లోనే గ్రంధాలయాలు ఉన్నాయి అని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ గారికి తెలియ జేయగా ఇంకా పెద్దా గ్రామాలకు విస్తరించే విధంగా చూడాలని కోరగా ఆయన ప్రభుత్వం తో మాట్లాడతానని చెప్పారు అని తెలిపారు. పురుషోత్తపట్నం లైబ్రేరియన్ కృపాణందం గారు జెడ్పీటీసీ సభ్యురాలు అన్నవరపు ఎలిజా బెత్ రాణి గార్లు వాల్ పోస్టర్లు విడుదల చేశారు.