తిరువూరు నగర పంచాయతీ టీడీపీ కైవసం

భారత్ న్యూస్ విజయవాడ…తిరువూరు నగర పంచాయతీ టీడీపీ కైవసం

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు :

ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నగర పంచాయతీని ఎట్టకేలకు టీడీపీ కైవసం చేసుకుంది. తిరువూరు నగర పంచాయతీ ఛైర్పర్సన్ గా నిర్మల ఎన్నిక అయ్యారు.

ఎక్స్అఫీషియో సభ్యుడితో సహా ఆమెకు 11 ఓట్లు వచ్చాయి. వైసీపీ అభ్యర్థి ప్రసాద్ ను 9మంది బలపరిచారు.

ఈ నగర పంచాయతీలో 20 మంది కౌన్సిల్ సభ్యులతో పాటు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఎక్స్అఫీషియో మెంబర్ గా ఉన్నారు.

గతంలో పలుమార్లు ఈ ఎన్నిక ఉద్రిక్తతల నడుమ వాయిదా పడగా, ఇవాళ భారీ బందోబస్తు మధ్య ప్రశాంతంగా జరిగింది.