భారత్ న్యూస్ విజయవాడ…ఆపరేషన్ సింధూరి విజయోత్సవ యాత్ర
విశ్వహిందూ పరిషత్ కృష్ణాజిల్లా అధ్యక్షులు డాక్టర్ శ్రీ బూరగడ్డ శ్రీనాథ్ గారు మరియు ఉత్తరాంధ్ర పల్నాటి వెంకటస్వామి నాయుడు గారు కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు వర రాజశేఖర్ గారి పిలుపుమేరకు..,
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సరైన సమయంలో ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని పాకిస్తాన్ ఉగ్రవాదుల ఆట కట్టించారని కొనియాడుతూ ఆపరేషన్ సింధూరం విజయవంతం చేసినందుకు….

ఆపరేషన్ సింధూరం విజయవంతం చేసిన త్రివిధ దళాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి భారత ప్రజలకు సంఘీభావంగా…
కోడూరు మండల హిందూ ప్రముఖులు ఆధ్యాత్మిక కార్యక్రమాల రూపశిల్పి మనందరికీ సుపరిచితులు హిందూ బంధువు శ్రీ అన్నం యోగానంద అవనిగడ్డ విశ్వహిందూ పరిషత్ ఉపాధ్యక్షులు పోతబోయిన వెంకట సుబ్రహ్మణ్యం హోటల్ పాములు నేతృత్వంలో….
కోడూరు మండలం నుండి మూడు బస్సులలో సుమారు 120 మంది పైన కళాకారులు విశ్వహిందూ పరిషత్ సభ్యులు కోరాటం సభ్యులు భక్తులు హిందూ బంధువులతో…
మచిలీపట్నంలోని అతి పురాతన దేవాలయమైన శివగంగ దేవస్థానం, గూడూరు మండలం డోకిపర్రు గ్రామంలో అతి సుందరంగా నిర్మించిన శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, మంగినపూడి సింధూ స్నానం, చిలకలపూడి శ్రీ పాండురంగ స్వామి దేవస్థానంలో భారత ప్రభుత్వం, త్రివిధ దళాలు క్షేమం కోసం, లోక కళ్యాణార్థం ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ప్రత్యేక పూజాలు అనంతరం దేవాలయ ప్రాంగణాలలో నామ సంకీర్తన కార్యక్రమం..
ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ కోడూరు ఖండ అధ్యక్షులు.. కోట సత్యనారాయణ, ఉపాధ్యక్షులు.. చిట్టిప్రోలు సుబ్రహ్మణ్యేశ్వర రావు, మనేష్ కాగిత నాగేశ్వరరావు ,జరుగు సాంబశివరావు, కోడూరు మండల బజరంగల్ ప్రముఖ…శివకోటి పిచ్చయ్య, నరహరశెట్టి సురేష్ (భవాని స్వామి) మరియు విశ్వహిందూ పరిషత్ గ్రామ అధ్యక్షులు, కార్యదర్శులు, విశ్వహిందూ పరిషత్ సభ్యులు, భజన కళాకారులు, మహిళా మాతలు ,భక్తులు ,హిందూ బంధువులు తదితరులు పాల్గొన్నారు.