ఏపీలో జూన్ 1న కానిస్టేబుల్ ఉద్యోగాలకు తుది రాత పరీక్ష

భారత్ న్యూస్ విశాఖపట్నం..Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీలో జూన్ 1న కానిస్టేబుల్ ఉద్యోగాలకు తుది రాత పరీక్ష

అమరావతి :

ఏపీలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు జూన్ 1వ తేదీన తుది రాత పరీక్ష నిర్వహించనున్నట్లు రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు చైర్మన్ రాజీవ్ కుమార్ మీనా తెలిపారు. ఉ.10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుందన్నారు. కాకినాడ, గుంటూరు, విశాఖ, తిరుపతి, కర్నూలులో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కాగా, ఇవాళ సాయంత్రం 5 గంటలకు http://slprb.ap.gov.in వెబ్సైట్ నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.