భారత్ న్యూస్ అనంతపురం .. …Ammiraju Udaya Shankar.sharma News Editor…న్యాయ వ్యవస్థను కించపరుస్తూ కనపర్తి చేసిన కామెంట్స్ పై వెంటనే కేసు నమోదు చెయ్యాలి
-వైసీపీ యువనేత గౌతమ్
ఈరోజు పసుపు మీడియా ఏబీఎన్ ఛానల్ డిబేట్లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ కనపర్తి శ్రీనివాసరావు ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పై కోర్టులో పెండింగ్లో ఉన్న కేసు గురించి మాట్లాడే క్రమంలో న్యాయవ్యవస్థను కించపరిచే విధంగా కామెంట్స్ చేయడమే కాక రిటైర్మెంట్ తర్వాత ఇచ్చే నామినేటెడ్ పోస్టుల కోసం కొందరు జడ్జిలు ఆశపడుతున్నారంటూ నిరాధారమైన ఆరోపణలు చేయడం న్యాయవ్యవస్థను తీవ్రంగా అవమానించడనేనని న్యాయ వ్యవస్థపై ఇలాంటి దుర్మార్గమైన ఆరోపణలు చేసిన కనపర్తి శ్రీనివాసరావును మరియు తప్పుడు కామెంట్స్ చేస్తున్న కనపర్తిని ఆపే ప్రయత్నం చేయకుండా డిబేట్ ను కొనసాగించి, దాన్ని ప్రచారం చేసిన ఏబీఎన్ ఛానల్ యాజమాన్యం పైన వెంటనే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టి న్యాయవ్యవస్థ పై ప్రజలలో ఉన్న గౌరవాన్ని కాపాడాలని వైసిపి యువనేత గౌతమ్ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు….,
తన వ్యక్తిగత పబ్లిసిటీ కోసం నోరు తెరిస్తే బూతులు మాట్లాడే కనపర్తి శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డి వాయిదాలకు వెళ్లకుండా తప్పించుకు తిరుగుతున్నాడని NBW ఇచ్చి అరెస్టు చేయాలని నీతులు మాట్లాడే ముందు క్రిమినల్ కేసులలో సంవత్సరాల తరబడి వాయిదాలకు వెళ్లకుండా కోర్టు వారు నాన్ బెయిలబుల్ వారంటీ ఇచ్చినా లెక్క చేయని వారు, అనేక కేసులలో నేటికీ ముద్దాయిలుగా ఉన్న కొందరు ఈరోజు మన రాష్ట్ర మంత్రులుగా కొనసాగుతున్నారనే విషయాన్ని తెలుసుకుని మాట్లాడితే మంచిదని గౌతమ్ తెలిపారు…,
ప్రతి సందర్భంలోనూ రఘురామకృష్ణం రాజు కేసును ప్రస్తావించే కనపర్తి అందులో ముద్దాయిగా ఉన్న తులసి బాబుకు బహిరంగంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నేటికీ మద్దతు తెలుపుతుంటే మీరు నోరెందుకు మెదపటం లేదని గౌతమ్ ప్రశ్నించారు…,

ప్రజలలో ఎంతో గౌరవభావం మరియు నమ్మకం కలిగి ఉన్న న్యాయవ్యవస్థ పట్ల మీ పబ్లిసిటీ కోసం దిగజారుడు వ్యాఖ్యలు చేయడం సరికాదని, వెంటనే కనపర్తి న్యాయవ్యవస్థకు బహిరంగ క్షమాపణ చెప్పాలని గౌతమ్ డిమాండ్ చేశారు.