ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో అసాధారణ వీరత్వం ప్రదర్శించి ప్రతిష్టాత్మక కీర్తి చక్ర పురస్కారం

భారత్ న్యూస్ రాజమండ్రి…తమిళనాడు :

ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో అసాధారణ వీరత్వం ప్రదర్శించి ప్రతిష్టాత్మక కీర్తి చక్ర పురస్కారం అందుకున్న భారత సైన్యానికి చెందిన లాన్స్ నాయక్ ఎ. మీనాక్షి సుందరంను తమిళనాడు ప్రభుత్వం ఘనంగా సత్కరించింది.

ఆయన ధైర్యసాహసాలకు గుర్తింపుగా తమిళనాడు ప్రభుత్వం రూ.48 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. ఈ సందర్భంగా జూన్ 15న చెన్నై సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి C. Joseph Vijay స్వయంగా చెక్కును అందజేసి, దేశ సేవలో ఆయన చూపిన అసమాన ధైర్యానికి అభినందనలు తెలిపారు…