ఎఫ్సీఐ(FCI) కమిటీ ఏపీ చైర్మన్ గా ఎంపీ లావు

భారత్ న్యూస్ అనంతపురం .. .ఎఫ్సీఐ(FCI) కమిటీ ఏపీ చైర్మన్ గా ఎంపీ లావు

ఏపీలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్సీఐ) కమిటీ రాష్ట్ర చైర్మన్ టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎన్నికయ్యారు.

ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

చైర్మన్ హోదాలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు రాష్ట్రంలో పంట ఉత్పత్తులు, ధాన్యం సేకరణ తదితర వాటిపై అధ్యయనం చేస్తారు.

నివేదికలు రూపొందించి ఎఫ్సీఐకి సమర్పిస్తారు. తనకు ఈ పదవిలో నియమించినందుకు ప్రధాని మోదీకి ఎంపీ లావు కృతజ్ఞతలు తెలిపారు