మద్యం ఇండెంట్‌లో రూ. 1. 50 కోట్ల మోసం.. ఉద్యోగి పరారీ

భారత్ న్యూస్ శ్రీకాకుళం…మద్యం ఇండెంట్‌లో రూ. 1. 50 కోట్ల మోసం.. ఉద్యోగి పరారీ

పల్నాడు జిల్లా :-

నరసరావుపేటలో మద్యం ఇండెంట్ లావాదేవీల్లో భారీ మోసం వెలుగుచూసింది. ప్రైవేటు ఉద్యోగి కిషోర్‌పై కంపెనీలకు జమ చేయాల్సిన నగదులో సగం మాత్రమే ఖాతాల్లో వేసి, మిగతా మొత్తాన్ని స్వాహా చేసినట్లు ఆరోపణలున్నాయి. సుమారు రూ. 1.50 కోట్లు పక్కదారి పట్టించినట్లు తెలిసింది. విషయం బయటపడటంతో కిషోర్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. వ్యాపారులు డిపో అధికారులకు ఫిర్యాదు చేశారు….