భారత్ న్యూస్ వరంగల్…ఒకటి, రెండు కాదు.. ఏకంగా ఐదు పెళ్లిళ్లు చేసుకుని వరుసగా వరులను మోసం చేసిన ‘నిత్య పెళ్లికూతురు’ వజ్రపు మణి
మధ్యవర్తుల ద్వారా పెళ్లిళ్లు కుదుర్చుకుని లక్షల రూపాయలు ఎదురుకట్నంగా తీసుకునేది. పెళ్లైన కొద్ది రోజుల్లోనే అనారోగ్యం సాకుతో పుట్టింటికి వెళ్తానని చెప్పి పరారయ్యేది.
బాధితుల్లో ఒకరు రూ.3.8 లక్షలు ఇచ్చి పెళ్లి చేసుకోగా, నంద్యాల రైల్వే స్టేషన్లో రైలు దిగి అదృశ్యమైంది.
దర్యాప్తులో ఇప్పటికే ఐదుగురిని ఇదే తరహాలో మోసం చేసినట్లు, ఆమెకు కుమారుడు, కుమార్తె కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

కర్ణాటకలో మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నట్లు సమాచారం రావడంతో అరెస్ట్ చేసి, నిందితురాలితో పాటు వివాహ మధ్యవర్తులపై కూడా కేసులు నమోదు చేశారు.