జిల్లాలో 2,06,521 ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ: జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా

భారత్ న్యూస్ విజయవాడ…జిల్లాలో 2,06,521 ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ: జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా

​పల్నాడు జిల్లా, జూన్ 17: ఈ నెల 14 నుంచి జిల్లా వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (సర్) ప్రక్రియ అత్యంత పారదర్శకంగా, వేగంగా సాగుతోందని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఒక ప్రకటనలో తెలిపారు.

జిల్లాలోని మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇప్పటివరకు 2,06,521 ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లకు పంపిణీ చేశామన్నారు. ఇందులో అత్యధికంగా పెదకూరపాడు నియోజకవర్గంలో 45,063 ఫారాలు, నరసరావుపేటలో 40,346 ఫారాలు పంపిణీ చేశామన్నారు. క్షేత్రస్థాయి నుండి సేకరించిన ఫారాల ఆన్‌లైన్ నమోదు ప్రక్రియ నిరంతరం కొనసాగుతోందని, ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 5,455 ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు.

​జిల్లా వ్యాప్తంగా మొత్తం 17,41,798 మంది ఓటర్లు ఉన్నారని, వీరి వివరాల సేకరణ మరియు సవరణ కోసం క్షేత్రస్థాయిలో బి.ఎల్.ఓ ల ద్వారా ముమ్మరంగా సర్వే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.