చోరీ కేసులో ముద్దాయి అరెస్టు 80 గ్రాముల బంగారు అభరణాలు స్వాధీనం. ముద్దాయి కి 15 రోజుల రిమాండ్ విధించిన గౌరవ పాకాల జడ్జి గారు.
పాకాల (భారత్ న్యూస్) అరెస్టు చేసిన ముద్దాయి వివరాలు: ఆర్. చిరంజీవి (32 సంవత్సరాలు), తండ్రి ఆర్. వెంకటేష్, వృత్తి కూలి, నివాసం పోలకల రెడ్డివారిపల్లి గ్రామం, ఐరాల మండలం, చిత్తూరు జిల్లా.
స్వాధీనం చేసుకున్న బంగారు అభరణాలు
1). సాదా బంగారు చైను..10 గ్రాములు.
2). సాదా బంగారు చైను. 16 గ్రాములు.
3). సాదా బంగారు నెక్లెస్. 15 గ్రాములు.
4). రెండు పేటల బంగారు చైన్. 39 గ్రాములు. . మొత్తం 80 గ్రాముల బంగారు అభరణాలు.
తిరుపతి జిల్లా SP గారు గౌరవ L సుబ్బారాయుడు IPS గారి ఆదేశాల మేరకు చంద్రగిరి సబ్ డివిజన్ DSP బేతపూడి ప్రసాద్ గారి సూచనల తో ఇటీవల జరుగుతున్న దొంగతనాల పై ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దొంగతనం కేసులు అరికట్టాలి అని ఇచ్చిన ఆదేశాలు తో పాకాల ఇన్స్పెక్టర్ టి చిన్న గోవిందు గారు, పాకాల SI తరుణ్, PC ముని శేఖర్, PC త్రినాథ్ మరియు HG రెడ్డప్ప లతో ప్రత్యేక టీమ్ లు ఏర్పాటు చేసినారు. ఈ దినము అనగా 16.6.26 నాడు ఉదయం 9 గంటల ప్రాంతంలో utlavaaripalli గ్రామ సమీపం లో ఉన్న పైన తెలిపిన ముద్దాయి నీ అరెస్టు చేసి అతని వద్ద నుండి నేరము చేసిన పై బంగారు ఆభరణాలు ను రికవరీ చేయడం జరిగింది.
సదరు ముద్దాయి పాకాల మండలం, పత్తిపాటి వారి పల్లి గ్రామంలో కంప్లైట్ గిరిబాబు ఇంట్లో గత 6 నెలల క్రితం దొంగతనం చేశాడు అని అందులో ఉండే 80 గ్రాముల బంగారు అభరణాలు, 30 వేల నగదు దొంగతనం చేశాడు అని ఒప్పుకున్నాడు.

కేసు ను ఛేదించిన పాకాల పోలీసు స్టేషన్ ఇన్స్పెక్టర్ టి చిన్న గోవిందు గారు నీ, పాకాల SI C తరుణ్. మరియు PC త్రినాథ్, ముని శేఖర్ వారికి రివార్డ్ ల కొరకు SP గారి కి సిఫార్స్ లు పంపుతున్నాం అని పాకాల ఇన్స్పెక్టర్ గారు పత్రిక సమావేశం లో తెలిపారు.