గొడ్డలి పార్టీ సైకోలను ప్రజలు తరిమికొట్టాలి : కనపర్తి శ్రీనివాసరావు

భారత్ న్యూస్ రాజమండ్రి…గొడ్డలి పార్టీ సైకోలను ప్రజలు తరిమికొట్టాలి : కనపర్తి శ్రీనివాసరావు

అవనిగడ్డలో అమర్నాథ్ గౌడ్‌కు టీడీపీ శ్రేణుల ఘన నివాళి

అవనిగడ్డ, జూన్ 16: కృష్ణాజిల్లా అవనిగడ్డలో వైసిపి రౌడీ మూకల చేతిలో అసువులు బాసిన బీసీ విద్యార్థి అమర్నాథ్ గౌడ్ కు తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులర్పించాయి. జగన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రేపల్లెలో తన అక్కను ఎందుకు ఏడిపించారంటూ నిలదీసిన 10వ తరగతి విద్యార్థి అమర్నాథ్ గౌడ్ ను మూడు సంవత్సరాల క్రితం ఇదే రోజున అతి కిరాతకంగా గోన సంచిలో మూటగట్టి, పెట్రోల్ పోసి తగలబెట్టి చంపిన దారుణ ఘటన జరిగి నేటికీ మూడు సంవత్సరాలు పూర్తయింది. అమర్నాథ్ గౌడ్ మూడవ వర్ధంతిని పురస్కరించుకొని అవనిగడ్డ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక రాజీవ్ గాంధీ బొమ్మ సెంటర్ వద్ద నివాలులర్పించి, భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అవనిగడ్డ నియోజకవర్గ పరిశీలకులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి శ్రీ కనపర్తి శ్రీనివాసరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన బీసీ నాయకులతో కలిసి అమర్నాథ్ గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కనపర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ పసివాడని కూడా చూడకుండా, టెన్త్ క్లాస్ చదువుకుంటున్న బీసీ సామాజిక వర్గానికి చెందిన అమర్నాథ్ గౌడ్‌పై పెట్రోల్ పోసి, గోనసంచిలో మూటగట్టి తగులబెట్టిన నాడు వైకాపా నాయకులు చేసిన అరాచకం రాష్ట్ర చరిత్రలోనే ఒక నల్లటి రోజు అని దుయ్యబట్టారు.నాడు ప్రతిపక్షంలో ఉన్నా, నేడు కూటమి అధికారంలో ఉన్నా నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అమర్నాథ్ గౌడ్ కుటుంబానికి కొండంత అండగా ఉంటుందని స్పష్టం చేశారు.గత ఐదేళ్ల వైకాపా పాలనలో ఇలాంటి ఎందరో అమాయకులు బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ అరాచక శక్తుల, రౌడీ మూకల నిజస్వరూపాన్ని ప్రజలందరూ ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు,మండల పార్టీ అధ్యక్షులు నడకుదిటి జనార్దన రావు,యాసం చిట్టిబాబు,బండే శ్రీనివాసరావు,మెండు లక్ష్మణరావు,మోర్ల రాంబాబు,జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు మాచవరపు ఆదినారాయణ,కృష్ణాజిల్లా తెలుగుదేశం పార్టీ కార్యవర్గం సభ్యులు లకనం నాగాంజనేయులు,రావి రత్నగిరి,కొల్లూరి బసవేశ్వరరావు,అవనిగడ్డ ప్రకాశం నియోజవర్గ పార్టీ నాయకులు మండలి రామమోహనరావు,మోర్ల ప్రసాద్,మోర్ల జయలక్ష్మి,పరిసే చలపతి, పరిసే మౌళి,లుక్క పిచ్చియ్య,తాడేపల్లి పాపారావు,తాతా పోతురాజు,మల్లంపల్లి శివ రామకృష్ణ,బొర్రా అగ్గిరాముడు,బండే రాఘవ,మెగవత్తు గోపి,అప్పికట్ల రవీంద్ర,కొక్కిలిగడ్డ జాన్ విల్సన్,ఉప్పల ప్రసాద్,కర్రి కృష్ణమూర్తి,ఈవూరి నాగార్జున,మోర్ల శివ,ఘంటసాల రాజమోహనరావు,దాసినేని శ్రీనివాసరావు,కంచర్ల ఆనంద్,కొల్లూరి వాసు,అన్నపరెడ్డి లక్ష్మినారాయణ మహిళా నేతలు బండే కనకదుర్గ,కొక్కిలిగడ్డ మాధవి,అన్నపరెడ్డి వెంకటేశ్వరమ్మ ,కనగాల రాధ,తదితరులు పాల్గొన్నారు