బంగారం కొనొద్దు.. ప్రధాని మోదీ పిలుపు వెనుక అసలు కారణం ఇదే

భారత్ న్యూస్ హైదరాబాద్…బంగారం కొనొద్దు.. ప్రధాని మోదీ పిలుపు వెనుక అసలు కారణం ఇదే

Ammiraju Udaya Shankar.sharma News Editor…దేశ ప్రజలు ఏడాది పాటు బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చేసిన సూచన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దీనికి ప్రధాన కారణం గ్లోబల్ ఎనర్జీ క్రైసిస్, రూపాయి విలువ పతనం. భారత్ బంగారం, క్రూడాయిల్ కోసం దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతుంది, వీటికి చెల్లింపులు డాలర్లలో చేయాల్సి ఉంటుంది. బంగారం కొనుగోళ్లు పెరిగితే దేశంలోని డాలర్ రిజర్వ్స్ తగ్గి, అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి వాల్యూ మరింత పడిపోయే ప్రమాదం ఉంది. ఈ ఆర్థిక లోటును కట్టడి చేసి, రూపాయిని బలోపేతం చేయడమే ప్రధాని ఉద్దేశమని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు..