భారత్ న్యూస్ గుంటూరు…సి.ఎం కు సిపిఐ బహిరంగ లేఖ
మరో ఉద్దానములా మారుతున్న ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గ ఏ కొండూరు, గంపలగూడెం కిడ్నీ బాధితుల సమస్య పరిష్కారానికి ముఖ్యమంత్రి నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలని కోరుతూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మరియు ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనేపూడి శంకర్ సీఎం కు శుక్రవారం బహిరంగ లేఖ.
కృష్ణాజిల్లాలో పైప్ లైన్ కోసం 50 కోట్లతో సాగిన నాసిరకం పనుల ఏర్పాటుపై జరిగిన కాంట్రాక్టు పనులు పై ఇంజనీరింగ్ నిపుణులతో విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలి. జలజీవన్ ప్రాజెక్టు పనులపై సమగ్ర విచారణ జరిపించాలి. శుక్రవారం ఉదయం హనుమాన్ పేట దాసరి భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ తో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు బుట్టి రాయప్ప, మేకల డేవిడ్, ఎ కొండూరు మండల సీపీఐ కార్యదర్శి ముచింతల వేంకటేశ్వరారావు తదితరులు పాల్గొన్నారు. అభివందనంతో
దోనేపూడి శంకర్
కార్యదర్శి, ఎన్టీఆర్ జిల్లా
ఏ కొండూరు మండలంలోని అన్ని గ్రామాలకు కృష్ణా జలాలను ఇంటింటికి కుళాయిల ద్వారా త్రాగునీటిని సరఫరా చేయాలి.
ఏ కొండూరు ప్రాథమిక వైద్యశాలను 50 పడకల ఆసుపత్రిగా నిర్మాణం చేయాలి.
కిడ్నీ బాధితులకు పోషకాహారం అందించాలి.
మండలంలో ఉన్న అన్ని గ్రామాలకు కృష్ణా జలాల విషయంలో కొత్త పైప్ లైన్ నిర్మాణం జరిగిన వాటిని డైరెక్ట్ పంపింగ్ స్కీముకు లైన్లు కలపటం వలన కృష్ణా జలాలు కలుషితమవుతున్నాయి. నూతన ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపామని అధికారులు మభ్యపెడుతున్నారు. ప్రభుత్వం దీనిపైన స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరుతున్నాము.
కిడ్నీ డయాలసిస్ సెంటరుకు నెఫ్రాలజిస్ట్ ను ప్రత్యేకంగా ఈ నాటికి ప్రభుత్వం నియమించలేదు.
కిడ్నీ బాధితులకు క్రియాటిన్ 1.5 దాటిన వారందరికీ ఐదు వేల రూపాయలు పెన్షన్, మందులు, పోషకాహారం ప్రభుత్వమే అందించాలి.
కిడ్నీ బాధిత అన్ని గ్రామాల్లో రోగులకు స్క్రీనింగ్ టెస్ట్ లు ప్రభుత్వమే నిర్వహించాలి.

కిడ్నీ వ్యాధితో మరణించిన వారికి మట్టి ఖర్చులు నిమిత్తం కులాలతో సంబంధం లేకుండా అన్ని కులాల వారికి 30 వేల రూపాయలు ఇవ్వాలి. వారి కుటుంబాలకు సాగుకై ఎకరం భూమిని ఇవ్వాలి.