భారత్ న్యూస్ గుంటూరు…ఏలూరులో దారుణం.. ప్రియుడి కోసం రూ.12 లక్షల సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించిన భార్య
గత నెల 17న హత్యకు గురైన వడ్లమాను గ్రామానికి చెందిన సులేమాన్ రాజు కేసును పోలీసులు ఛేదించారు.
వడ్లమాను సచివాలయంలో పనిచేస్తున్న వెంకన్నబాబుతో సులేమాన్ రాజు భార్య దుర్గామణి అక్రమ సంబంధం పెట్టుకుంది. విషయం తెలిసిన భర్త సులేమాన్ రాజు తరచూ వేధించడంతో, అతడిని అడ్డు తొలగించాలనే ప్లాన్ వేసింది.
భర్తను అడ్డు తొలగించేందుకు ప్రియుడితో కలిసి రూ.12 లక్షలు సుపారీ ఇచ్చారు. సెల్‌ఫోన్ ఛార్జింగ్ కేబుల్‌తో సులేమాన్ రాజును హత్య చేసి, మృతదేహాన్ని ఉప్పులూరు రైవస్ కాలువలో పడేశారు.
హత్యపై పోలీసులు విచారణ జరపగా, ప్రియుడి కోసం భార్యే సుపారీ ఇచ్చి భర్తను హత్య చేయించినట్లు దర్యాప్తులో తేలింది.

నిందితుల వద్ద నుంచి కారు, సెల్ఫోన్లు, నగదు, ఛార్జింగ్ కేబుల్ స్వాధీనం చేసుకున్న పోలీసులు