ఏపీ హై కోర్టు సంచలన తీర్పు

భారత్ న్యూస్ విజయవాడ…ఏపీ హై కోర్టు సంచలన తీర్పు

అక్రమంగా నిర్మించిన మండలి వెంకట కృష్ణా రావు గారి విగ్రహాన్ని తొలగించాలంటూ తీర్పు వెలువరించిన ఏపీ హైకోర్టు

నేషనల్ హైవే – 216 పులిగడ్డ టోల్ ప్లాజా వద్ద వాహన దారులకు ఇబ్బంది కలిగిస్తూ అక్రమంగా నిర్మించిన మండలి వెంకట కృష్ణా రావు గారి విగ్రహాన్ని తొలగించాలంటూ ప్రముఖ న్యాయవాది బడే వెంకట శేషగిరి రావు ఏపీ హైకోర్టు వారి ఎదుట రిట్ పిటీషన్ నంబర్ W.P. No. 7082/2026 (బడే వెంకట శేషగిరి రావు vs యునియన్ ఆఫ్ ఇండియా) దాఖలు చేయగా పిటిషనర్ తరపున న్యాయవాది మలిశెట్టి వెంకట శివ తేజ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి జస్టిస్ తర్లాడ రాజశేఖర రావు గారు విగ్రహాన్ని తొలగించాలంటూ అధికారులకు అదేశిస్తూ తీర్పును వెలువరించారు.

ప్రజా జీవనానికి ఆటంకం కలిగిస్తూ, నిబంధనలకు విరుద్ధంగా విగ్రహాలు నిర్మిస్తూ, విగ్రహ రాజకీయాలకు పాల్పడేవారికి హై కోర్టు వారు ఇచ్చిన తీర్పు చంపపెట్టు లాంటిదని బడే శేషగిరి వ్యాఖ్యానించారు.