భారత్ న్యూస్ తిరుపతి…శని బాధ నివారణకు………………!!
శనివారం రోజున శరీరానికి నువ్వుల నూనె పట్టించి నలుగుపెట్టి , ఆ నలుగు పిండిని 5 ఇనుప మేకులు నల్లని వస్త్రంలో మూటకట్టి ప్రవాహంలో పారవేసి నదిలో స్నానం చేసి ఉతికిన వస్త్రములను ధరించి అచ్చటనే పాత వస్త్రములను విడిచి పెట్టిరండి . ఆ రోజు ఏకభక్తం , నేల పడక విధిగా చెయ్యాలి . ఇతరులను దూషించకూడదు . కలహించకూడదు . ‘ఓం అంటూ ‘శివనామస్మరణ’ మంత్రములను గాని ‘హం హనుమాయ’ అనే మంత్రాన్ని ఆ దినమంతయు జపించుట మంచిది . అష్టమ , అర్దాష్టమ , ఏలినాటి శనియే గాక జాతకచక్రములో శని దుష్టానంలో నుండి ఆ దశ జరుగుతూ కలిగించే దుష్ఫలితముల నుండి విముక్తులు కాగలరు . రోగ బాధలు తొలగుతాయి . సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవిస్తారు .
