భారత్ న్యూస్ ఢిల్లీ…..బల్గేరియాకు చెందిన ప్రసిద్ధ అంధురాలు, భవిష్యవాణి చెప్పడంలో దిట్ట అయిన బాబా వంగా చేసిన అంచనాలు ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటాయి.
ఆమె గతంలో చెప్పిన 9/11 దాడులు, సునామీ వంటి ఘటనలు నిజం కావడంతో ఆమె మాటలకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది. తాజాగా 2026 సంవత్సరానికి సంబంధించి ఆమె చేసిన ఓ అంచనా ఇప్పుడు భారత్తో సహా ప్రపంచ దేశాలను కలవరపెడుతోంది. రాబోయే కాలంలో ప్రకృతి ప్రకోపం ఏ స్థాయిలో ఉండబోతుందో బాబా వంగా తన జోస్యంలో వివరించారు.
ప్రచండమైన ఎండలు ఉక్కిరిబిక్కరి చేసే ఉక్కపోత
బాబా వంగా అంచనా ప్రకారం.. 2026లో ఎండలు గతంలో ఎన్నడూ లేని విధంగా అత్యంత తీవ్రంగా ఉండబోతున్నాయి. వడగాల్పులు, సూర్యుని ప్రచండమైన వేడి ప్రజలను ఉక్కరిబిక్కిరి చేస్తాయి. ఎంతలా అంటే.. మనం ఇంట్లో వాడుకునే ఏసీలు, కూలర్లు కూడా ఆ వేడి నుంచి, ఉక్కపోత నుంచి ఉపశమనాన్ని కలిగించలేవని బాబా వంగా పేర్కొన్నారు. విపరీతమైన దాహం, గొంతు ఎండిపోయే పరిస్థితులు ఎదురవుతాయని.. కేవలం నీడలో ఉన్నా సరే వేడి సెగలు తగిలి ప్రజలు అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు.
నిజమవుతున్న అంచనాలు?

ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే బాబా వంగా మాటలు నిజమవుతున్నాయా? అనే అనుమా