మీ భద్రత మా బాధ్యత” అనే సందేశంతో మహిళల్లో చైతన్యం

మీ భద్రత మా బాధ్యత” అనే సందేశంతో మహిళల్లో చైతన్యం

శక్తి టీమ్ ఆధ్వర్యంలో MSKs, మెప్మా, డ్వాక్రా మరియు రాస్ మహిళలకు అవగాహన కార్యక్రమం

అత్యవసర సేవలు (112, 181), శక్తి యాప్, సైబర్ భద్రతపై సూచనలు.

-మహిళల సాధికారత, ఆత్మవిశ్వాసం, మానసిక బలం పెంపుపై నిపుణుల మార్గదర్శనం

తిరుపతి (మీ రిపోర్టర్ హేమంత్) తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్ సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు, ఈరోజు తిరుపతి శక్తి టీమ్ సహకారంతో బాలాజీ కాలనీలోని శ్రీలక్ష్మీనారాయణ భవన్‌లో “మహిళల భద్రతపై అవగాహన సదస్సు” నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం ప్రత్యేకంగా MSKs, మెప్మా, డ్వాక్రా సంఘం మహిళలు మరియు రాస్ మహిళల కోసం నిర్వహించబడింది. “మీ భద్రత మా బాధ్యత” అనే శక్తివంతమైన సందేశంతో ఈ సదస్సు మహిళల్లో భద్రతాపై అవగాహన పెంపొందించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ కార్యక్రమానికి తిరుపతి మహిళా డీఎస్పీ శ్రీమతి ఎం. శ్రీలత గారు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిపుణులు తమ ప్రసంగాల ద్వారా మహిళల సాధికారత, భద్రత, మానసిక ఆరోగ్యం వంటి అంశాలపై సమగ్ర అవగాహన కల్పించారు.
— INFACT సర్టిఫైడ్ ట్రైనర్ మరియు హ్యాపినెస్ కోచ్ యు. హేమావతి గారు స్వీయ నియంత్రణ, భయాన్ని జయించడం, ఆత్మవిశ్వాసం పెంపు వంటి అంశాలతో పాటు ధ్యానం, పుస్తక పఠనం వంటి మంచి అలవాట్ల ప్రాముఖ్యతను వివరించారు. ICDS పథకం కింద చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కృష్ణ మంజరి గారు మహిళల భద్రతపై అవగాహన కల్పిస్తూ 112, 181 వంటి అత్యవసర నంబర్లు, శక్తి యాప్ వినియోగం, సోషల్ మీడియా జాగ్రత్తలు మరియు సైబర్ నేరాలపై అప్రమత్తత గురించి తెలియజేశారు. సైకాలజిస్ట్ మరియు సోషల్ ఇంపాక్ట్ లీడర్ జె. సునీత గారు మహిళలు హింసకు వ్యతిరేకంగా మౌనం పాటించకుండా ధైర్యంగా తమ స్వరం వినిపించాలని, వ్యక్తిగత పరిమితులు ఏర్పాటు చేసుకోవాలని, “లేదు” అని చెప్పే ధైర్యం కలిగి ఉండాలని మరియు భావోద్వేగ సమతుల్యతను కాపాడుకోవాలని సూచించారు
తిరుపతి మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీమతి ఎం. శ్రీలత గారు మాట్లాడుతూ దేశ అభివృద్ధి మహిళలు మరియు పురుషుల సమానాభివృద్ధిపై ఆధారపడి ఉంటుందని పేర్కొంటూ, మహిళలపై జరుగుతున్న నేరాల నివారణ, ఆత్మహత్య నిరోధం, మానసిక బలం పెంపు వంటి అంశాలపై MSKs, మెప్మా, డ్వాక్రా మరియు రాస్ మహిళలకు కీలక సూచనలు అందించారు.
ఈ సదస్సు మహిళల్లో భద్రతా అవగాహన, ఆత్మవిశ్వాసం మరియు సమాజపట్ల బాధ్యతను పెంపొందించే దిశగా ఒక ముఖ్యమైన అడుగుగా నిలిచిందని అన్నారు ఈ కార్యక్రమంలో తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీ శ్రీ కొండయ్య గారు, తిరుపతి మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం. తమీమ్ అహ్మద్ గారు, తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ గారు, మహిళా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్లు ఈ. జగన్నాధ రెడ్డి, ఎస్. కుళ్లాయ్యప్ప మరియు శ్రీమతి చి. సరస్వతి గారు, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి సుధారాణి గారు, వన్ స్టాప్ సెంటర్ ప్రతినిధి శ్రీమతి సుజాత గారు తదితరులు పాల్గొన్నారు