నటుడు ప్రకాష్ రాజ్‌పై కరాటే కళ్యాణి ఫిర్యాదు

భారత్ న్యూస్ హైదరాబాద్….నటుడు ప్రకాష్ రాజ్‌పై కరాటే కళ్యాణి ఫిర్యాదు

భారత పురాణేతిహాసాలను కించపరిచేలా మాట్లాడారంటూ నటుడు ప్రకాష్ రాజ్‌పై నటి కరాటే కళ్యాణి తీవ్రంగా మండిపడ్డారు. కోట్లాది మంది ఆరాధ్యదైవం శ్రీరాముడిని అవమానించేలా ఆయన చేసిన వ్యాఖ్యలు

హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో, సోమవారం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ రామకృష్ణకు కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు.

ప్రకాష్ రాజ్‌పై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు….