.భారత్ న్యూస్ హైదరాబాద్….ఆపిల్ తో పోటీ పడుతున్న నిమ్మ ధరలు – కేజీ నిమ్మ రూ.200…
రాష్ట్రంలో ఎండలకు మించి నిమ్మ ధరలు మండిపోతున్నాయి.
యాపిల్స్ రేట్లతో పోటీ పడుతున్నాయి. నెల్లూరు (D) గూడూరు మార్కెట్లో ఇవాళ 50 కేజీల బస్తా ఏకంగా రూ.10వేలు పలికింది. గతవారం కేజీ రూ.130-150 ఉండగా ఇప్పుడు రూ.200కు చేరింది.

దిగుబడి భారీగా తగ్గిపోవడం, ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం కోసం ప్రజలు ఎక్కువగా నిమ్మ రసంపై ఆధారపడటంతో డిమాండ్ పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు….