ముప్పు ముంచుకొస్తోంది.. జాగ్రత్త!

భారత్ న్యూస్ రాజమండ్రి…ముప్పు ముంచుకొస్తోంది.. జాగ్రత్త!

2026లో నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే తక్కువగా (92%) నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(IMD) తొలి అంచనా వేసింది.

‘ఎల్ నినో’ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోకి రుతుపవనాల రాక ఆలస్యమై, వర్షాలు బలహీనపడవచ్చు.

దీనివల్ల ఎండలు, ఉక్కపోత పెరిగి వ్యవసాయ పనులు సాగించే రైతుల ఆరోగ్యంపై, పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.