భారత్ న్యూస్ వరంగల్….. …వైభవంగా శ్రీ అభయాంజనేయ స్చామి ఆలయంలో అమావాస్య పూజలు
- ఆలయానికి వంట సామాగ్రి అందజేసిన భక్తులు
గద్వాల మున్సిపాలిటి పరిధిలోని 3వ వార్డులోని హామాలి కాలనీలో శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయంలో అమావాస్య పూజలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. అన్నదానం ఏర్పాట్ల కోసం వంటపాత్రలు, వంట సామాగ్రిని దాతలు వెంకటేశ్వర్లు, నరేష్ లు ఆలయానికి అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ నాగులు యాదవ్, మార్కెట్ వైస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, ఆలూరు మాజీ ఎంపిటిసి ఆనంద్ గౌడ్ దాతలను శాలువాతో సన్మానించారు. ఈ కార్య క్రమంలో హన్మంతు రెడ్డి, టైలర్ శీను,గంగాధర్ రెడ్డి,లక్ష్మన్న, గడ్డం నర్సింహ్మ, పెద్ద నర్సంహ్మలు, తదితరులు పాల్గొన్నారు..
