భారత్ న్యూస్ గుంటూరు…అమెరికా అందాల పోటీల్లో పల్నాడు జిల్లా యువతికి రన్నరప్ గా గౌరవం
అమెరికాలో జరిగిన ‘తెలుగు యూఎస్ఏ’ అందాల పోటీల్లో పల్నాడు జిల్లాకు చెందిన దివ్యశ్రీ రన్నరప్‌గా నిలిచి ప్రతిభ కనబరిచారు.
చిలకలూరిపేట మండలం లింగంగుంట్ల గ్రామానికి చెందిన దివ్యశ్రీ ప్రస్తుతం అమెరికాలో ఐటీ ఉద్యోగిగా పనిచేస్తున్నారు.
ఆరు నెలల పాటు జరిగిన ఈ పోటీల్లో అందం, వ్యక్తిత్వం, ప్రతిభ, తెలివితేటల్లో ఆమె మెరుగైన ప్రదర్శనతో ప్రత్యేక గుర్తింపు పొందారు.

దివ్యశ్రీ సాధించిన ఈ విజయంపై ఆమె కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు….