హంటర్ సేవలు – పోలీస్ శాఖకు చిరస్మరణీయం”

భారత్ న్యూస్ తిరుపతి…తిరుపతి జిల్లా పోలీస్ శాఖ
తేది: 26-03-2026.

“హంటర్ సేవలు – పోలీస్ శాఖకు చిరస్మరణీయం”

పోలీస్ శాఖకు సేవలందించిన పోలీసు డాగ్ “హంటర్”కు ఘన నివాళి.

తిరుపతి జిల్లా పోలీస్ శాఖలో సుదీర్ఘకాలం పాటు విశిష్ట సేవలందించిన డాగ్ “హంటర్” అనారోగ్య కారణాలతో మృతి చెందడం పట్ల జిల్లా పోలీస్ శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.

తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ శ్రీ డి.శ్రీనివాసరావు గారు, (సాయుధ దళం) సిబ్బంది కలిసి హంటర్‌కు ఘనంగా పుష్పాంజలి ఘటించి అంతిమ నివాళులు అర్పించారు.

హంటర్ గురించి కొన్ని విశేషాలు.

రెడ్ సాండర్స్ అక్రమ రవాణా కేసుల గుర్తింపులో “హంటర్” విశేష ప్రతిభ కనబరిచి, పోలీస్ శాఖకు అమూల్యమైన సేవలు అందించింది.

2016లో హైదరాబాద్ మోయినాబాద్‌లోని IITA కేంద్రంలో శిక్షణ పొందిన హంటర్, తన సేవల కాలమంతా నిబద్ధత, కర్తవ్యనిష్ఠతో విధులు నిర్వర్తించి శాఖకు గౌరవాన్ని తీసుకొని రావడం జరిగింది.

గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో పోరాడుతూ, వైద్య చికిత్స పొందుతూ వచ్చిన హంటర్, 26-03-2026 తేదీన మధ్యాహ్నం 01:45 గంటలకు కన్నుమూయడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బంది హంటర్ సేవలను స్మరించుకుని, ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.