దేశంలో 100 కొత్త ఎయిర్‌పోర్టులు.. కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్*

భారత్ న్యూస్ అనంతపురం..దేశంలో 100 కొత్త ఎయిర్‌పోర్టులు.. కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్*

ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీ పెంచేందుకు దేశంలో 100 కొత్త ఎయిర్‌పోర్టులు నిర్మిండానికి కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీనిలో భాగంగా ఎయిర్‌పోర్టులతోపాటు, హెలిపోర్టులు, వాటర్ ఏరోడ్రోమ్స్‌ను కూడా కేంద్రం నిర్మించనుంది. 2026-2027 నుంచి 2035-2036 వరకు, పదేళ్లపాటు ఉడాన్ స్కీమ్‌ కింద వీటిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది

దీనికోసం రూ.28,840 కోట్లను కేంద్రం కేటాయించనుంది. దీని ద్వారా చిన్న పట్టణాలకు ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీ పెరుగుతుందని కేంద్రం చెబుతోంది