కీచక అర్చకుడు…

భారత్ న్యూస్ శ్రీకాకుళం….కీచక అర్చకుడు….

మచిలీపట్నం:

ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక యువతి అనారోగ్యం తో ఉంది. ఆ యువతికి నీరసం, వికారంగా ఉన్న పెద్దగా పట్టించుకోలేదు. ఒంట్లో కొంచెం నలతగా ఉండటంతో తల్లిదండ్రులు ఆమెను డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లారు. వైద్యులు పరీక్షల నిర్వహించి ఆ యువతిని గర్భవతిగా నిర్ధారించారు. యువతి తల్లిదండ్రులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న యువతి, పెళ్లి కాకుండానే గర్భవతి కావడంతో తల్లిదండ్రులు బాధపడుతూ ఆ యువతని నిలదీశారు. యువతి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది.

మచిలీపట్నం లక్ష్మణాపురం దగ్గరలో ఉన్న రామాలయంలో అర్చకుడిగా పనిచేస్తున్నాడు. ప్రతిరోజు రామాలయంలో పూజలు చేస్తూ దేవుని స్మరిస్తూ ఉంటాడు. భక్తులు అందరూ ఆ పూజారి వద్దకు వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటారు కానీ ఆయనలో ఉన్న కీచక బుద్ధిని ఎవ్వరు గమనించలేదు. భక్తిశ్రద్ధలతో ఉండాల్సిన అర్చకుడు బరితెగించాడు. అర్చకుడి నీచపు బుద్ధి అర్చక వృత్తికే కళంకం తెచ్చింది. 45 ఏళ్ల అర్చకుడు, తన భార్య ,పిల్లలతో మచిలీపట్నం నిజాంపేట లో ఉంటున్నాడు. ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న యువతి అర్చకుని కుటుంబంతో సన్నిహితంగా ఉంటుంది. అర్చకుడు భార్య ఆ యువతిని తన కుటుంబంలో ఒకరిగా, ఇంటి మనిషిగా చూసుకుంటుంది. కానీ అర్చకుడు మాత్రం వక్రబుద్ధితోనే చూశాడు. దీనిని భార్య ఏమాత్రం గ్రహించలేదు. అర్చకుడు ఆ యువతి ఒంటరిగా ఉన్న సమయం చూసి లైంగికంగా వేధించటం మొదలుపెట్టాడు. తన లైంగిక వాంఛ తీర్చాలని ఆ యువతని బలవంతం పెట్టేవాడు. అర్చకుని కామ కోరికను యువతి ఒప్పుకోకపోవడంతో యువతని బెదిరించి వశపరచుకున్నాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెప్తే యువతి అంతు చూస్తానన్నాడు. ప్రతిరోజు రామాలయంలో దేవునికి పూజలు చేసి పాపానికి పాల్పడుతున్న ఆ పూజారి ఆటకు దేవుడు ముగింపు పలికాడు. అర్చకుడు యువతితో శారీరక వాంఛ తీర్చుకొని గర్భం దాల్చడం బయటపడింది. దీనితో తల్లిదండ్రులు అర్చకుడు పై మచిలీపట్నం ఆర్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు పై విచారణ చేసిన పోలీసులు కీచక అర్చకుడు పై ఫోక్సో కేసు నమోదు చేశారు.