భారత్ న్యూస్ గుంటూరు…’PAN’ కార్డుకు అప్లై చేస్తున్నారా?
ఏప్రిల్ 1 నుంచి పాన్ (PAN) కార్డ్ దరఖాస్తు నిబంధనల్లో కీలక మార్పులు రానున్నాయి. ఇకపై కేవలం ఆధార్ ఉంటే సరిపోదు.. పుట్టిన తేదీ ధృవీకరణ కోసం బర్త్ సర్టిఫికెట్, ఓటర్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి తప్పనిసరిగా సమర్పించాలి. పాత దరఖాస్తు ఫారమ్లు ఇకపై చెల్లవు. అలాగే ఆధార్ కార్డులో ఉన్న పేరునే పాన్ కార్డుపై ముద్రిస్తారని ప్రభుత్వం స్పష్టం చేసింది.
